
‘ఎల్లమ్మ’ ప్రాజెక్ట్‌ను వేణు ఎంతో కష్టపడి రాశారట. మొదట నానితో తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. అన్నీ సెట్ అయిన తర్వాత ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయింది. ఆ తర్వాత నితిన్, సాయి ధరమ్ తేజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పేర్లు వినిపించాయి. ఇప్పుడు ఆ అందరి పేర్లను పక్కన పెట్టి, ప్రత్యేకంగా దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాలో హీరోగా నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ బాగా పాటలు పాడతారు, అలాగే లుక్స్ విషయంలో కూడా బాగానే ఉంటారు. ఆయన ఎప్పటి నుంచో హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని ఆలోచిస్తున్నారట. గతంలో రెండు మూడు ఆఫర్లు కూడా వచ్చాయి అని వినిపించాయి. అయితే ఇప్పుడే ఆ అవకాశం "ఎల్లమ్మ" ద్వార దక్కిందని తెలుస్తుంది. దిల్ రాజు నిర్మాణంలో, వేణు దర్శకత్వంలో ‘ఎల్లమ్మ’ ప్రాజెక్ట్‌లో దేవి శ్రీ ప్రసాద్ హీరోగా నటించనున్నారట. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇదే వార్త బాగా ట్రెండ్ అవుతోంది.
ఇప్పటివరకు చిత్ర బృందం ఈ విషయంపై అధికారికంగా స్పందించలేదు. అందుకే ఈ వార్త నిజమా? లేక ఫేక్‌నా? అంటూ అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, హీరోయిన్‌గా మాత్రం మొదటి నుంచి సాయి పల్లవి పేరునే ఫిక్స్ చేసుకున్నారట. హీరోలు మారుతున్నా, హీరోయిన్ మాత్రం సాయి పల్లవి గానే కొనసాగుతున్నారట. ఇప్పుడు చూడాలి మరి — దేవి శ్రీ ప్రసాద్‌నే ఫైనల్‌గా హీరోగా ఫిక్స్ చేస్తారా? లేక రేపటికి ఇంకో హీరో పేరు తెరపైకి వస్తుందా?