కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కానీ పాలనపరంగా చాలా వెనుకబడిపోతుంది. ముఖ్యంగా మంత్రుల మధ్య వైరుధ్యాలనేవి పెరిగిపోతున్నాయి. పైన పటారం లోన లొటారం అనే విధంగా మంత్రులంతా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతమున్న పరిస్థితులు చూస్తే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు గెలిపించుకున్నాం రా దేవుడా అని ప్రజలకు అనిపించే విధంగా వారి వ్యవహార శైలి ఉందని చెప్పవచ్చు. వాళ్లు పాలనను గాలికి వదిలేసి మంత్రుల మధ్య మంత్రులే గొడవలు పెట్టుకుని పరువు తీసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో మంత్రి పొన్నం ప్రభాకర్, సహచర మంత్రి వడ్లూరి లక్ష్మణ్ ను దున్నపోతు అని తిట్టడంతో వివాదంగా మారింది. దీంతో ప్రజల నుంచి విమర్శలు రావడంతో  క్షమాపణలు కోరారు. ఇది మరవకముందే కొండా సురేఖ మంత్రి పొంగులేటి మధ్య వివాదాలు ఏర్పడ్డాయి. ఇది మరవకముందే మళ్లీ కొండా సురేఖ ఓఎస్డి గన్ పట్టుకొని బెదిరించారని ఒక వివాదం బయటకు వచ్చింది. 

ఇలా రోజుకొక వివాదంతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో పలుచబడుతోందని చెప్పవచ్చు. నిజానికి కొండా సురేఖ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంటుంది. తాను ఒక మంత్రిని అనే విషయాన్ని కూడా మర్చిపోతూ ఉంటుంది. అయితే నిజానికి  కొండా సురేఖ ఓఎస్డి నాగ సుమంత్ అనే వ్యక్తి డెక్కన్ సిమెంట్ వాళ్లను బెదిరిస్తూ గన్ చూపించాడని చెబుతూ ఉత్తంకుమార్ రెడ్డి పోలీసులకు కంప్లైంట్ చేసినట్టు కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. దక్కన్ సిమెంట్ వ్యవహారంలో సుమంత్ తో పాటు ముఖ్యమంత్రి ప్రధాన అనుచరుడు రోహన్ రెడ్డి కూడా ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ తంగమంతా నడుస్తున్న సమయంలో  ఓఎస్డి ఉద్యోగం  నుంచి  సుమంత్ ను తొలగించారు..అంతేకాకుండా  ఆయనను పోలీసులు అరెస్టు చేయకుండా కాపాడుకుంటూ వస్తున్నారు  కొండా సురేఖ. ఇలా కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన కల్లోలం సృష్టించిన కొండా సురేఖపై అధిష్టానం  సీరియస్ అయినట్టు తెలుస్తోంది.

ఈ తతంగానికి  సంబంధించి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని  మీనాక్షి నటరాజన్ మహేష్ కుమార్ గౌడ్ ను ఆదేశించినట్లు సమాచారం. ఒకవేళ కొండా సురేఖ ఓఎస్డి  తప్పు చేశాడని తెలిస్తే మాత్రం ఆమెను  క్యాబినెట్ నుంచి తొలగిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. కట్ చేస్తే ఈ వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి  దగ్గరి వ్యక్తి వేం నరేందర్ రెడ్డి డైరెక్షన్ చేసినట్టు తెలుస్తోంది. వేం నరేందర్ రెడ్డి పంపితేనే రోహిన్ రెడ్డి డెక్కన్ సిమెంట్ కంపెనీ వాళ్లతో మాట్లాడానికి వెళ్లారని,  కొండా సురేఖ ఓఎస్డి సుమంత్ గన్ చూపించారని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ తతంగం అంతా బయటకు వచ్చేసరికి  రోహిన్ రెడ్డి పేరు వేం నరేందర్ రెడ్డి పేరు అసలు వినిపించడం లేదు. కానీ సుమంత్ ను మాత్రం హైలెట్ చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే మాత్రం కొండా సురేఖను పక్కన పెట్టాలని ప్లాన్ చేసినట్టే కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: