తాజాగా ప్రియదర్శి "మిత్ర మండలి" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ మూవీ విడుదలకు ముందు ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను పెద్ద ఎత్తున నిర్వహించింది. ఇక ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ యూనిట్ ఈ మూవీ నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలా మంచి అంచనాల నడుమ ఈ సినిమా తాజాగా విడుదల అయింది.

తాజాగా విడుదల అయిన ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే కాస్త మిక్స్ డ్ టాక్ వచ్చింది. మరి ఇప్పటికే మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేసి ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి. ఈ సినిమాపై మొదటి నుండి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండడంతో ఈ మూవీ కి నాన్ థియేటర్ బిజినెస్ ద్వారానే భారీ ఎత్తున బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి నాన్ థియేటర్ బిజినెస్ ద్వారా 9.5 కోట్ల భారీ బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది.

ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క ఓ టీ టీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ వారు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా యొక్క శాటిలైట్ హక్కులను జీ 5 సంస్థ వారు దక్కించుకున్నట్లు సమాచారం. ఈ మూవీ కి సంబంధించిన కొన్ని వారాల థియేటర్ రన్ ముగిశాక ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు , ఆ తర్వాత కొన్ని వారాలకు ఈ సినిమా జీ 5 ఛానల్లో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Mm