మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర , మన శంకర వర ప్రసాద్ అని రెండు సినిమాలలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. విశ్వంబర మూవీ ని చిరంజీవి చాలా కాలం క్రితమే మొదలు పెట్టాడు. ఈ మూవీ అత్యంత భారీ గ్రాఫిక్స్ సన్నివేశాలతో రూపొందుతూ ఉండడంతో ఈ మూవీ షూటింగ్ కాస్త డిలే అవుతూ వస్తుంది. మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నట్లు చిరంజీవి కొన్ని రోజుల క్రితం అధికారికంగా ప్రకటించాడు.

మన శంకర వర ప్రసాద్ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితం స్టార్ట్ అయిన అత్యంత వేగంగా ఈ మూవీ యొక్క చిత్రీకరణ పూర్తి అవుతుంది. నయనతార ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. చిరంజీవి తన నెక్స్ట్ మూవీ ని బాబి కొల్లి దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ మూవీ చిరంజీవి కెరియర్లో 158 వ మూవీ గా రూపొందబోతుంది. దానితో ఈ మూవీ ని మెగా 158 అనే వర్కింగ్ టైటిల్తో అధికారికంగా లాంచ్ చేశారు. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇప్పటికే ఈ మూవీ లో చిరంజీవి కి జోడిగా నటించబోయే ముద్దుగుమ్మను బాబి కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో చిరంజీవికి జోడిగా యంగ్ అండ్ బ్యూటిఫుల్ నటిమణి మాళవిక మోహనన్ నటించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇప్పటికే చిరంజీవి , బాబీ కాంబోలో రూపొందిన వాల్టేర్ వీరయ్య సినిమా మంచి విజయం సాధించడంతో వీరి కాంబోలో రూపొందబోయే రెండవ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొనే అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: