
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి వచ్చిన ప్రతి అప్‌డేట్ ఫ్యాన్స్‌ను ఉత్సాహపరుస్తుంది. తాజాగా పవన్ నటించిన “ఓజి” సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ సక్సెస్ సాధించి, పవన్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో పవన్ మరోసారి తన స్టార్ పవర్‌ను నిరూపించుకున్నాడు. ఈ విజయంతో తర్వాత ఆయన తదుపరి సినిమా ఏది అనే చర్చలు ఇండస్ట్రీలో వేడెక్కాయి. ఇప్పటికే టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన వార్త ఏమిటంటే, పవన్ కళ్యాణ్ - కే వి ఎన్ ప్రొడక్షన్స్ కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ లాక్ అయినట్టుగా సమాచారం వస్తోంది. ఈ ప్రొడక్షన్ హౌస్ ప్రస్తుతం పెద్ద పెద్ద ప్రాజెక్ట్‌లను నిర్మిస్తూ ఇండస్ట్రీలో మంచి పేరును సంపాదించింది.
ఈ సంస్థ దగ్గర లోకేష్ కనగరాజ్, హెచ్ వినోద్ వంటి స్టార్ డైరెక్టర్ల డేట్స్ కూడా ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు పవన్ నెక్ట్స్ మూవీని ఈ ఇద్దరు క్రేజీ డైరెక్టర్లలో ఎవరు ? డైరెక్ట్ చేస్తారనే ఆసక్తి పెరిగింది. ఫ్యాన్స్ మాత్రం “పవన్ కళ్యాణ్ – లోకేష్ కనగరాజ్ – అనిరుధ్” కాంబినేషన్ కావాలంటున్నారు. ఈ ముగ్గురి కలయిక అంటే అద్భుతమైన యాక్షన్, మాస్, మ్యూజికల్ ఫీస్ట్ అని వారు భావిస్తున్నారు. లోకేష్ స్టైల్, పవన్ మాస్ ఇమేజ్, అనిరుధ్ ఎనర్జిటిక్ మ్యూజిక్ కలిస్తే రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.
అయితే ఈ డ్రీమ్ కాంబినేషన్ నిజమవుతుందా లేదా అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ, సినిమా బాధ్యతలతో బిజీగా ఉన్నా, ఆయన ఫ్యాన్స్ మాత్రం మరో బ్లాక్‌బస్టర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ రూపు దిద్దుకుంటే, ఇది సౌత్ సినిమా హిస్టరీలో ఒక సూపర్ కాంబినేషన్‌గా నిలిచే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.