
అంటే.. బాహుబలి2 విడుదలైన (ఏప్రిల్ 28, 2017) వారం రోజులకు ట్వీట్ చేశారన్నమాట. ‘ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే... ’రాజమౌళి గారు... బాహుబలి పార్ట్ 1,2 కలిపి ఎడిట్ చేసి ఒక సినిమాగా రిలీజ్ చెయ్యండి. ఇది ఇప్పటి వరకు ప్రపంచ సినిమా చరిత్రలో జరగని అద్భుతం. ఈ అద్భుతం తో మళ్లీ తక్కువలో తక్కువగా రూ.500 కోట్లు కలెక్షన్స్ రాబట్టవచ్చు. అలాగే ప్రేక్షకులకు మరో అద్భుతమైన అనుభూతిని మీ ఎడిటింగ్ సామర్థ్యాలతో చూపించవచ్చు’ అని ట్వీట్ వేశారు. తన వ్యాపార సామర్థ్యాలతో లాయిడ్ గ్రూప్ అధినేతగా ఎదిగిన ఆయన... తన ముందు చూపు ఆలోచనలతో రెండు పార్టులుగా విడుదలైన ఓ సినిమాను ఒకే పార్టుకింద విడుదల చేయండని ఏడేళ్ల క్రితం తను ట్విట్టర్ లో పంచుకున్న అభిప్రాయం ఇప్పుడు నిజం అవుతున్నందుకు చాలా సంతోషపడుతున్నారు. ఏడేళ్ల క్రితమే చేసిన ఈ ఆలోచనపై ఆయనను అభినందిస్తున్నారు. అటు వ్యాపార రంగంలోనే కాదు ఇటు సినిమా రంగంలోనూ విజన్ ఉన్న వ్యాపారవేత్తగా విక్రం నారాయణ రావు గారిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.