మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబి కొల్లి దర్శకత్వంలో మరి కొంత కాలంలో ఓ మూవీ స్టార్ట్ కాబోతున్న విషయం మన అందరికి తెలిసిందే. గతంలో చిరంజీవి హీరో గా బాబీ దర్శకత్వంలో వాల్టేరు వీరయ్య అనే సినిమా రూపొందింది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించింది. ఇలా ఇప్పటికే వీరి కాంబోలో రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా మంచి విజయం సాధించడంతో వీరి కాంబోలో రూపొందబోయే రెండవ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం బాబి , చిరంజీవి సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదు. కానీ ఈ సినిమాలో ఆ బ్యూటీ హీరోయిన్ గా కనిపించనుంది ... ఈ బ్యూటీ హీరోయిన్గా కనిపించనుంది అని అనేక మంది పేర్లు మాత్రం ఇప్పటికే తెర పైకి వచ్చాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... చిరు మూవీ లో ఒక కీలకమైన పాత్ర ఉన్నట్లు , అందులో మలయాళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మోహన్ లాల్ ను తీసుకోవాలి అనే ఆలోచనలో బాబి ఉన్నట్లు , ప్రస్తుతం అందులో భాగంగా మోహన్ లాల్ తో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. మోహన్ లాల్ గతంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన జనతా గ్యారేజ్ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడం , ఈ సినిమాలో మోహన్ లాల్ పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండడంతో ఈ సినిమా ద్వారా మోహన్ లాల్ కి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. మరి నిజం గానే చిరు , బాబీ కాంబో సినిమాలో మోహన్ లాల్ నటిస్తాడా ..? లేదా అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: