తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన నిర్మాతలలో ఒకరు అయినటువంటి దిల్ రాజు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన సినిమా పరిశ్రమంలో డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ను మొదలు పెట్టాడు. డిస్ట్రిబ్యూటర్ గా కొన్ని సంవత్సరాలు పాటు కెరియర్ను కొనసాగించిన తర్వాత దిల్ రాజు నిర్మాతగా సినిమాలను నిర్మించడం స్టార్ట్ చేశాడు. అందులో భాగంగా ఈయన కెరియర్ ప్రారంభంలో నిర్మించిన సినిమాలు చాలా వరకు అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. కొన్ని సంవత్సరాల పాటు ఈయన నిర్మాతగా అపజయం లేకుండా కెరియర్ను ముందుకు సాగించాడు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం దిల్ రాజు నిర్మించిన సినిమాలు చాలా వరకు ప్రేక్షకులను నిరుత్సాహ పరుస్తున్నాయి. దిల్ రాజు ఇప్పటివరకు చాలా సంవత్సరాలుగా సినిమాలను నిర్మిస్తున్న ఆయన స్టార్ హీరోలతో చాలా తక్కువ సినిమాలనే నిర్మించాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన స్టార్ హీరోలతో నేను చేసిన సినిమాలలో కేవలం జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన రామయ్య వస్తావయ్య , రామ్ చరణ్ తో చేసిన గేమ్ చెంజర్ ఈ రెండు సినిమాలతో మినహాయిస్తే నాకు ఏ సినిమాతో కూడా నష్టాలు రాలేదు. అందరూ స్టార్ హీరోల సినిమాలతో నాకు మంచి లాభాలు వచ్చాయి అని ఆయన చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే దిల్ రాజు కొంత కాలం క్రితం నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన తమ్ముడు అనే సినిమాను రూపొందించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర భారీ అపజయాన్ని సొంతం చేసుకుంది. మరి కొంత కాలం లోనే విజయ్ దేవరకొండ హీరోగా రౌడీ జనార్దన్ అనే సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. దిల్ రాజు చాలా కాలం క్రితమే బలగం వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ అనే సినిమాను చేయనున్నట్లు ప్రకటించాడు. మరి ఈ సినిమాను దిల్ రాజు ఎప్పుడు మొదలు పెడతాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: