తమిళ సినీ పరిశ్రమలో నటుడిగా , దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రదీప్ రంగనాథన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ మధ్య కాలంలో ఈయన వరుస పెట్టి మంచి విజయాలను అందుకుంటూ వస్తున్నాడు. కొంత కాలం క్రితం ఈయన నటించి దర్శకత్వం వహించిన లవ్ టుడే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఈయన హీరో గా రూపొందిన డ్రాగన్ మూవీ కూడా సూపర్ సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఈయన డ్యూడ్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర మంచి టాక్ వచ్చింది.

దానితో ప్రస్తుతం ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్లు బాక్సా ఫీస్ దగ్గర దక్కుతున్నాయి. ఈ సినిమా బుక్ మై షో ప్లాట్ ఫామ్ లో సూపర్ సాలిడ్ రెస్పాన్స్ ను జనాల నుండి దక్కించుకుంటుంది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన 1.2 మిలియన్ టికెట్లు బుక్ మై షో యాప్ లో సేల్ అయినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన టికెట్లు బుక్ మై షో లో 1.2 మిలియన్ సేల్ అయ్యాయి అంటేనే అర్థం అవుతుంది ఈ సినిమాపై ప్రేక్షకులు ఏ రేంజ్ రెస్పాన్స్ ను చూపిస్తున్నారు అనేది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తూ ఉంటే ఈ సినిమాతో కూడా ప్రదీప్ రంగనాథన్ కి డ్యూడ్ మూవీ తో మంచి విజయం దక్కే అవకాశాలు కనబడుతున్నాయి. డ్యూడ్ మూవీ ని తెలుగు లో కూడా విడుదల చేశారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: