ఆ తర్వాత ఎన్నో సీరియల్స్లలో నటించింది సాండ్రా. ఈ ఏడాది అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన సంగతి కూడా తెలిసిందే. గడిచిన కొద్ది రోజుల క్రితం తన ప్రియుడిని కూడా అభిమానులకు పరిచయం చేసింది. తన ప్రియుడితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. మనసిచ్చి చూడు సీరియల్ లో హీరోగా నటించిన మహేష్ బాబు కాళిదాసుతో కొన్నేళ్లపాటు ప్రేమలో ఉన్న సాండ్రా ఇటీవల ఎంగేజ్మెంట్ తో తమ ప్రేమ విషయాన్ని నడిచింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని మొదలుపెట్టి తమకు సంబంధించిన అన్ని విషయాలను పంచుకున్నారు.
ఇప్పుడు తాజాగా వివాహ బంధంతో ఒక్కటయ్యారు అక్టోబర్ 30న వివాహ జరిగినట్లుగా తెలుస్తోంది. వీరిద్దరికి పెళ్లికి సంబంధించి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ గా మారుతున్న ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఈ జంటకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వీరి పెళ్లికి పలువురు సినీ ప్రముఖులు, సిని తారలు కూడా హాజరైనట్లుగా తెలుస్తోంది. సాండ్రా పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఇదివరకే ఈమెకు వివాహం అయ్యింది .19 ఏళ్ల వయసులోనే ఈ వివాహం కాగా తన భర్త మరొక అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడని తెలిసి విడాకులు ఇచ్చేసింది. అప్పటినుంచి కెరియర్ పైన ఫోకస్ చేసిన సాండ్రా ఇప్పుడు వరుస సీరియల్స్ తో బిజీగా మారింది
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి