విడుదల కాని విశ్వనాథ్ సినిమా . సిరిమువ్వల సింహనాదం సినిమా పేరు . ఈ పేరుతో విశ్వనాథ్ విడుదల కాని సినిమా ఒకటుందని నాతోపాటు చాలామందికి తెలియదనే అనుకుంటా . అదేంటి కె. విశ్వనాథ్ లాంటి సీనియర్ దర్శకుడు .. ఎన్నో కళాత్మక సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు తీసిన సినిమా రిలీజ్‌కాలేదా ? అంటే చాలా మందికి ఆశ్చర్యం కూడా వేస్తుంది. ఎస్ ఇది నిజం. ఈ సినిమా కధ ఏమిటంటే ఒక కూచిపూడి కళాకారుడు భామాకలాపంలో సత్యభామ పాత్రను వేసీ వేసీ స్త్రీ లాగానే మరదలికు కనిపిస్తాడు . మరదలు బావ ను పెళ్ళి చేసుకోనని చెప్పేస్తుంది . ఈలోపు ఓ రాజకీయ నాయకుడి సుపుత్రుడు మరదల్ని పాడు చేస్తాడు . దీపావళి నృత్య నాటకంలో సత్యభామగా నటిస్తున్న హీరో నిజంగానే సుపుత్రుడిని చంపేసి దుష్టశిక్షణ చేసి జైలుకు వెళ్ళిపోతాడు . కృష్ణం వందే జగద్గురుం సినిమాలో హీరో రాణా నరసింహుని పాత్రలో విలన్ని చంపేసినట్లుగా అన్నమాట.
ఇప్పటికీ ఆ సినిమా విడుదల కాకపోవటం దురదృష్టమే . ఓటీటీ ప్లాట్ఫారాలు పుష్కలంగా ఉన్న ఈ రోజుల్లో ఎవరో ఒకరు ఆ కళాత్మక దర్శకుడు విశ్వానథ్ మీద ప్రేమతో పూనుకుని ప్రేక్షకులకు ఆ సినిమా చూసే అవకాశం కల్పిస్తే బాగుంటుంది . కనీసం ఈ సినిమా యూట్యూబులో కూడా లేదు . సినిమా మీడియాలో ఉన్న కొందరు వ్యక్తుల ద్వారా ఈ విషయం బయటకు వచ్చి .. సోషల్ మీడియా లో వైరల్ కావడంతో అందరికి తెలిసింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి