షోలో భాగంగా జగపతి బాబు సరదాగా మాట్లాడుతూ, “నేను నీకు ‘గాలిపిల్ల’ అనే నిక్‌నేమ్ పెట్టాను” అని అన్నాడు. దానికి రష్మిక నవ్వుతూ, “అయ్యయ్యో సార్… మీరు కూడా ఆ పేరు పెట్టేశారుా!” అంటూ చమత్కరించింది. తర్వాత విజయ్ దేవరకొండ పేరు ప్రస్తావన వచ్చింది.జగపతి బాబు, “విజయ్ నీకు చాలా సన్నిహితుడు కదా… అంతా నిన్ను ‘విజయ్ గర్ల్’ అంటున్నారు. మరి నిజంగా విజయం, విజయ్ అంతా నీకే సొంతమా?” అని సరదాగా అడగగా, రష్మిక కొద్దిసేపు సిగ్గుపడుతూ “ఏమో…” అని చిరునవ్వుతో సమాధానమిచ్చింది.
తర్వాత జగపతి బాబు ఆమె చేతిలో ఉన్న రింగ్స్‌ను గమనించి, “నీ ఫింగర్స్‌లోని రింగ్స్ చాలా ఇంపార్టెంట్‌గా కనిపిస్తున్నాయి… వాటికి ఏదైనా స్పెషల్ మీనింగ్ ఉందా?” అని ప్రశ్నించాడు. దానికి రష్మిక హాస్యంగా, “అవును సార్, ఇవన్నీ నాకు చాలా ఇంపార్టెంట్. కాని ఇవి చూసి అందరూ ఎందుకింత గోల చేస్తున్నారో తెలియదు. వాటిలో ఒక రింగ్ మాత్రం నాకు బాగా స్పెషల్… దానికి ఓ హిస్టరీ ఉంది” అని చెప్పడంతో ఆడియన్స్ అంతా చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఆమె ముఖంలో కనిపించిన సిగ్గు, చిరునవ్వు అందరినీ ఆకట్టుకుంది. చివర్లో ఆమె, “నాకు వాళ్ల రియాక్షన్ చాలా ఇష్టం… ఆ అటెన్షన్, ఆ ప్రేమను నేను నిజంగా ఎంజాయ్ చేస్తున్నా” అని చెప్పడంతో స్టూడియోలోని ప్రేక్షకులు చప్పట్లతో దద్దరిల్లిపోయారు.
ప్రోమో చివర్లో రష్మిక చేతిలో ఉన్న రింగ్‌పై క్లోజ్‌అప్ షాట్ చూపించడం తో అభిమానుల్లో మరింత ఆసక్తి రేపింది. ఈ సన్నివేశం చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతూ, “ఇది నిజంగానే ఎంగేజ్‌మెంట్ రింగ్ అయి ఉండొచ్చు” అంటూ ““Congrats Rashmika-Vijay”” అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.మొత్తానికి, రష్మిక సరదా నడుమ ఇచ్చిన సమాధానాలు ఆమె సహజసిద్ధమైన అందాన్ని, మనసులోని సింప్లిసిటీని మరోసారి బయటపెట్టాయి. ఈ షో ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల్లో ట్రెండింగ్‌లో ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి