విక్రమ్ పాత్రలో నటించిన దీక్షిత్ శెట్టి తన నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశారు. సినిమా మొత్తం మీద అతని ఎమోషనల్ డెప్త్ మరియు రష్మికతో కెమిస్ట్రీ బాగా నచ్చింది. అయితే ఈ సినిమాలో విక్రమ్ పాత్ర కూడా అందరి దృష్టిని ఆకర్షించింది.మొదట ఈ విక్రమ్ పాత్రను నాగ శౌర్య కోసం అనుకున్నారట రాహుల్ రవీంద్రన్. నాగ శౌర్య - రష్మిక జోడీ ఇప్పటికే “ఛలో” సినిమాలో సూపర్ హిట్ అయింది. అందుకే దర్శకుడు మళ్లీ అదే కాంబినేషన్‌ను రిపీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. కానీ చివరికి అది జరగలేదు.
ఈ కారణం చాలా ఆసక్తికరంగా ఉంది. కథ విన్న నాగ శౌర్యకి కథ బాగా నచ్చినప్పటికీ, ఇందులో హీరోయిన్ పాత్రకే ఎక్కువ హైలైట్ దక్కుతుందని తెలుసుకుని కొంచెం వెనక్కి తగ్గారట. తాను చేస్తున్న సినిమాల్లో హీరో పాత్ర ప్రాముఖ్యత ఉండాలని భావించిన నాగ శౌర్య, ఈ సినిమా నుంచి బయటకు వచ్చినట్టు సమాచారం. ఆ తర్వాత ఆ పాత్రను దీక్షిత్ శెట్టికి ఆఫర్ చేయగా, అతను దాన్ని చాన్స్‌గా తీసుకుని అద్భుతంగా న్యాయం చేశాడు.ప్రస్తుతం “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా విజయవంతంగా నడుస్తుండగా, దీక్షిత్ శెట్టికి ఈ చిత్రం మంచి మైలురాయిగా మారింది. మరోవైపు నాగ శౌర్య ఈ అవకాశాన్ని వదిలేశాడన్న వార్త ఫిలింనగర్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చిన్న కారణం వల్ల వదిలేసిన ఈ సినిమా ఇప్పుడు హిట్ టాక్ తెచ్చుకోవడంతో అభిమానులు కూడా “ఇది నాగ శౌర్య చేస్తే కూడా బాగుండేది” అని కామెంట్స్ చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి