చాలా రోజుల తర్వాత సుమ మరోసారి సిల్వర్ స్క్రీన్ పైన మెరవబోతుంది. ఎప్పుడు షోలు,ఈవెంట్లు అంటూ బిజీబిజీగా గడిపే సుమ తాజాగా ప్రేమంటే అనే మూవీ తో మన ముందుకు రాబోతుంది. నవంబర్ 14న విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి రీసెంట్ గానే టీజర్ రిలీజ్ ఈవెంట్లో తన మాటలతో అందరిని కడుపుబ్బా నవ్వించింది. అయితే అలాంటి సుమ తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 25 ఏళ్ల బంధంలో రాజీవ్ కనకాల తో విడాకుల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. సుమ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రతి ఒక్క భార్యాభర్తల మధ్య ఖచ్చితంగా అభిప్రాయ భేదాలు అనేవి ఉంటాయి. అవి మా ఇంట్లో కూడా ఉంటాయి. ఇది అంతా కామన్. కానీ ఎప్పుడూ కూడా రాజీవ్ నేను విడిపోవాలని అనుకోలేదు. 

సోషల్ మీడియాలో చాలాసార్లు మేము విడిపోయినట్టు, విడాకులు తీసుకోబోతున్నట్టు వార్తలు వినిపించాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. మేమిద్దరం కలిసి వీడియో చేసి పెట్టిన ప్రతిసారి ఏదో ఒక కామెంట్ వస్తూనే ఉంటుంది.కొంతమంది అయితే ఏంటి వీరిద్దరూ ఇంకా విడిపోలేదా అన్నట్లుగా నెగిటివ్ కామెంట్లు కూడా పెడతారు.కానీ వాటిని మేము పట్టించుకోము. మేం చాలా సంతోషంగా ఉన్నాం. అలాగే నా కలలో వచ్చిన ప్రతి ఒక్క విషయం జరుగుతూ వస్తుంది. అందుకే నా కలలో ఏదైనా వస్తే అది కచ్చితంగా జరుగుతుంది అనే సెంటిమెంట్ కొద్ది రోజుల నుండి నాకు కలుగుతుంది. ఎందుకంటే ఓ రోజు నా కలలో టెంపుల్ కి వెళ్తున్నట్టు కల వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ డే ని మేము టెంపుల్ కి వెళ్ళాము. అలాగే ఓ రోజు రాజీవ్ కనకాల కి యాక్సిడెంట్ అయినట్టు నాకు కల వచ్చింది.

ఆ తర్వాత రాజీవ్ కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయలేదు. దాంతో భయం భయంగా చాలాసార్లు ఫోన్ చేస్తే ఆ తర్వాత ఫోన్ లిఫ్ట్ చేసి రాజీవ్ మాట్లాడడంతో ఊపిరి పీల్చుకున్నాను. ఆ తర్వాత నాకు కలలో ఇలా నీకు యాక్సిడెంట్ అయినట్టు అనిపించింది అని అనగానే.. వెంటనే రాజీవ్ అవును నిజంగానే నాకు యాక్సిడెంట్ జరిగింది. నా కారు చెట్టుకు గుద్దుకుంది అని రాజీవ్ చెప్పడంతో వెంటనే నేను లోకేషన్ కి వెళ్లి రాజీవ్ ని హాస్పిటల్ కి తీసుకువెళ్లి ట్రీట్మెంట్ చేయించాను. ఇలా చాలా సందర్భాల్లో నాకు వచ్చిన కలలు నిజమయ్యాయి అంటూ షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది సుమ. అలా ఫైనల్ గా సుమ ఈ ఇంటర్వ్యూలో తనకి రాజీవ్ కనకాల కి మధ్య వచ్చే విడాకుల వార్తలు అన్ని అవాస్తవం అని కొట్టిపారేసింది

మరింత సమాచారం తెలుసుకోండి: