ఆ కాంబో ఎవరిదో తెలుసా? అది మరెవరో కాదు — ఇండియన్ సినిమా పవర్ స్టార్స్ అయిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరియు డార్లింగ్ ప్రభాస్ కాంబినేషన్..వీళ్లిద్దరూ ఒకే తెరపై కనిపించబోతున్నారని సమాచారం వస్తోంది. ఈ ఇద్దరు భారీ స్టార్‌ల కాంబోలో రూపొందబోయే మల్టీస్టారర్ మూవీ ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉందని ఫిల్మ్ నగర్ టాక్. ఈ వార్త బయటకు వచ్చిన క్షణాల్లోనే సోషల్ మీడియాలో పాన్ ఇండియా మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్‌లో హడావుడి మొదలైంది.
మనందరికీ తెలిసిందే — ప్రభాస్ ప్రస్తుతం పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కూడా కొన్ని సినిమాలతో సూపర్ బిజీ షెడ్యూల్‌లో ఉన్నాడు. అయితే వీళ్లిద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో చూడాలని ఫ్యాన్స్ చాలా కాలంగా కోరుకుంటున్నారు. అదే ఇప్పుడు నిజం కాబోతోందని సినీ వర్గాల సమాచారం చెబుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను కొరటాల శివ దర్శకత్వం వహించనున్నారని టాక్. ఇప్పటికే ఆయన ఈ కాంబినేషన్‌పై ఓ మైండ్-బ్లోయింగ్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే వచ్చే ఏడాది చివరినాటికి ఈ మూవీని అధికారికంగా అనౌన్స్ చేయాలనే ప్రయత్నాలు జోరుగా జరుగుతున్నాయట. అలాగే 2028లో ఈ సినిమాను గ్రాండ్ స్కేల్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్న వివరాల ప్రకారం, ఈ సినిమా సాధారణ మల్టీస్టారర్ కాదు — ఇది “పాన్ వరల్డ్ మూవీ” స్థాయిలో ఉండబోతోందట. యాక్షన్, ఎమోషన్, విజువల్స్ — అన్నీ ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఉండేలా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నారట నిర్మాతలు. ప్రముఖ హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం అవ్వబోతున్నారని టాక్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి