సమంత సినిమాలు, మరొకవైపు నిర్మాతగానే కాకుండా బిజినెస్ రంగంలో కూడా తన టాలెంట్ ను చూపిస్తోంది. ఇప్పటికే సాకీ అనే పేరుతో క్లాతింగ్ బిజినెస్ ని కూడా నడుపుతోంది. అలాగే పెర్ఫ్యూమ్ బిజినెస్ కూడా గత వారం రోజుల క్రితం మొదలుపెట్టింది. ఇప్పుడు సమంత తాజాగా మరొక బిజినెస్ కు సంబంధించి.. ట్రూలీ స్మా. అనే పేరుతో మరొక క్లాతింగ్ బిజినెస్ ను కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సమంత వీడియోని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి న్యూ చాప్టర్ బిగిన్స్ అంటూ ఒక క్యాప్షన్ ని జోడించింది.
సమంత షేర్ చేసిన ఈ వీడియోని చూసిన అభిమానులు, నేటిజెన్స్ సైతం సమంతకు ఆల్ ది బెస్ట్ చెబుతూ మరింత ఎత్తుకు ఎదగాలంటు కోరుకుంటున్నారు. వాస్తవంగా సమంత నుంచి గుడ్ న్యూస్ అంటే తన రెండో వివాహం కోసం అభిమానులు చాలా ఎక్సైటింగ్ గానే ఎదురు చూస్తున్నారు. ప్రముఖ డైరెక్టర్ గా పేరుపొందిన రాజ్ నిడుమోరుతో డేటింగ్ చేస్తోందని వార్తలు వినిపించాయి. ఇప్పటివరకు ఈ విషయం పైన సరైన క్లారిటీ ఇవ్వలేదు ఎవ్వరు. కానీ అప్పుడప్పుడు రాజ్ తో కలిసి వెకేషన్స్ కి వెళితు షేర్ చేసే ఫోటోలు సైతం చూస్తే సమంత నిజంగానే ప్రేమలో ఉందనే అనుమానం కూడా కలుగుతుంది. మరి ఈ విషయం పైన సమంత ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి