గతంలో దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా, సమంతలు కూడా లేడీ ఓరియెంటెడ్, యాక్షన్ ఫిల్మ్స్‌లో నటించాలని తాము కోరుకుంటున్నామని పబ్లిక్‌గా చెప్పారు. ఇప్పుడు అదే లైన్‌లో అడుగులు వేస్తోంది మన నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్. రీసెంట్‌గా ఆమె ఆమె యాక్షన్ మూవీలు చేయాలని ఉంది అనగానే నెటిజన్స్ షాక్ అయ్యారు. కీర్తి సురేష్ ఇంతవరకు మహానటి, మిస్ ఇండియా, సర్కారు వారి పాట లాంటి విభిన్న పాత్రల్లో నటించింది. కానీ ఇప్పడు ఆమెకు యాక్షన్ రోల్ చేయాలనే ఆసక్తి పెరిగింది. అంటే, మాస్ యాక్షన్ సన్నివేశాల్లో ఫైట్ సీక్వెన్స్‌లు చేయడం, స్టంట్ సీన్స్‌లో పాల్గొనడం, తనదైన స్టైల్లో హీరోలా స్క్రీన్ మీద కనబడడం — ఇవన్నీ ఆమెకు కొత్త చాలెంజ్‌గా అనిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశం ఏమిటంటే — “కీర్తి సురేష్ కి ఆ యాక్షన్ దోమ కుట్టింది.. ఇక తర్వాత ఎవరు?” అనేది.
అందులో సమాధానం కూడా బయటపడింది. అదే మరొక స్టార్ హీరోయిన్ — శ్రీలీల! శ్రీలీల ఇప్పటివరకు చేసిన సినిమాలు ఎక్కువగా డ్యాన్స్, గ్లామర్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ జానర్‌కి సంబంధించినవే. కానీ ఇప్పుడు ఆమె కూడా యాక్షన్ సినిమా చేయాలని చాలా సీరియస్‌గా ప్రయత్నిస్తోందట. “డాన్స్, లవ్ స్టోరీలు చాలిపోయాయి.. ఇప్పుడు మాస్ యాక్షన్ ఫిలిం చేయాలి” అంటూ ఆమె తన సన్నిహిత వర్గానికి చెప్పిందట. అంతేకాదు, ఇటీవల కథ వినిపించడానికి వచ్చిన కొందరు డైరెక్టర్లకు “కథలో యాక్షన్ ఎలిమెంట్స్ ఉంటేనే చెస్తా” అని క్లియర్‌గా చెప్పిందట. ఇలా ఇప్పుడు ఇండస్ట్రీలో కీర్తి సురేష్, శ్రీలీల ఇద్దరూ లేడీ యాక్షన్ స్టార్ దిశగా అడుగులు వేస్తున్నారు. వీరి ఈ కొత్త యాక్షన్ మూడ్‌కి ఫ్యాన్స్ కూడా బాగా ఎగ్జైట్ అవుతున్నారు. “హీరోల మాదిరిగా వీళ్ళు కూడా స్క్రీన్ మీద యాక్షన్ సీన్స్ కొట్టేస్తే ఎలా ఉంటుందో చూడాలని ఉంది” అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇక చూడాలి, ఈ ఇద్దరి యాక్షన్ డ్రీమ్ ఎప్పుడు నిజం అవుతుందో! కానీ ఒక విషయం మాత్రం ఖాయం — ఈ ‘యాక్షన్ దోమ’ కుట్టిన తర్వాత ఇండస్ట్రీలో కొత్త లేడీ యాక్షన్ ఎరా మొదలవ్వడం ఖాయం!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి