ప్రస్తుతం విడుదలవుతున్న సినిమాలు ,వెబ్ సిరీస్లలో ఎక్కువగా రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్ సీన్స్, బెడ్ సీన్స్ చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇలాంటి వాటి వల్ల చాలామంది సెలబ్రిటీలు కూడా ట్రోల్స్ ఎదుర్కొంటూ ఉండగా, మరి కొంతమంది కేవలం ప్రేక్షకుల ఆనందం కోసమే తాము ఇలాంటివి చేస్తున్నామంటూ ప్రకటిస్తున్నారు మేకర్స్. అంతేకాకుండా ఇలాంటి వాటిలో నటించడం అంత ఈజీ కాదు అంటూ ఎంతోమంది సెలబ్రిటీలు తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి. మంగళవారం, తండేల్, భైరవం వంటి చిత్రాలలో కూడా నటించి నటి దివ్య పిళ్లై ఈ విషయాల పైన మాట్లాడింది.



దివ్య పిళ్లై ఎయిర్ లైన్స్ జాబ్ ను వదిలి మరి సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ మలయాళం ముద్దుగుమ్మ మొదటిసారిగా తగ్గేదేలే అనే చిత్రంలో హీరోయిన్గా నటించింది. ముఖ్యంగా ఆ సినిమాలో లిప్ లాక్ సీన్స్ లో నటించింది. ఈ విషయాలపైనే మాట్లాడుతూ తాను మొదట మలయాళంలో కళాపురుష్ అనే చిత్రంలో టోవినో థామస్ తో కలిసి  కొన్ని ఇంటిమేట్ సీన్స్ లలో నటించాను. మొదట చుట్టూ ఉన్న కెమెరాలు జనాలను చూసి అసౌకర్యంగా అనిపించి నో చెప్పాను కానీ దర్శకుడు కట్ చెప్పేవరకు నటించాల్సిందే అంటూ తెలిపింది.



ఆ సమయంలో ఏం చేసినా కూడా మనం ఓపికతో భరించాల్సిందే కెమెరా ఆన్ అయిన తర్వాత అటు నటుడు, నటి ఇద్దరూ కూడా తమ క్యారెక్టర్ లోకి లీనమైపోవాలి. కిస్ సీన్స్ లేదా బెడ్ సీన్స్ చేస్తున్నప్పుడు ఇబ్బందిగా అనిపించినా కూడా వాటిని ఫేస్ లో చూపించకూడదు. సీన్ పూర్తి అయ్యేవరకు సహనటుడు ఏం చేసినా కూడా కూల్ గా కనిపించాలి ఎందుకంటే ప్రేక్షకులు చూసేటప్పుడు ఫేక్ గా కాకుండా న్యాచురల్ గా కనిపించాలంటూ తెలియజేసింది. తాను గ్లామర్ పాత్రలు చేసిన అవి స్క్రిప్ట్ కి తగ్గట్టుగానే చేశానని ఎప్పుడూ తన లిమిట్స్ దాటలేదంటూ తెలిపింది. ప్రస్తుతం ఇమే చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: