ప్రముఖ సింగర్ గా పేరు సంపాదించిన చిన్మయి సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ పలు సంచలన ట్వీట్లను షేర్ చేస్తుంటుంది. తన మీద ట్రోల్ చేసే వారికి కూడా అదిరిపోయే కౌంటర్లు వేస్తుంది. ఇటీవలే ప్రముఖ కొరియోగ్రాఫర్ గా పేరు సంపాదించిన జానీ మాస్టర్ కు అవకాశాలు ఇవ్వడం పైన తనదైన స్టైల్ లో స్పందిస్తోంది. వీటికి తోడు తనని మంగళసూత్రం ధరించమని చెప్పిన వారి పైన కూడా గట్టి వార్నింగ్ ఇస్తోంది చిన్మయి. ఇప్పుడు తాజాగా మరొకసారి జానీ మాస్టర్ పైన ఫైర్ అవుతూ ఒక ట్విట్ చేసింది.


జానీ మాస్టర్ కేసు కాస్త క్లిష్టమైనది.. సె**క్సువల్  హెరాస్ చేయడమే కాకుండా ఇది ఇద్దరి సమ్మతితోనే జరిగిందంటూ కొంతమంది సమర్థిస్తున్నారు. ఒక మైనర్ బాలికను మేజర్ అయిన వ్యక్తి లోబరుచుకున్నారు ఖచ్చితంగా ఇందులో మేజర్ దే తప్పు ఉంటుందని, పైగా ఆ బాధితురాలు సహకరించని సందర్భాలలో బెదిరించి మరీ లొంగదీసుకోవడం చాలా దారుణం.. జానీ మాస్టర్ కు ఇండస్ట్రీలో ఉండేటువంటి పలుకుబడి వల్ల తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని.. ఈ సమస్య గురించి తాను మాట్లాడిన ప్రతిసారి కూడా అతని భార్య నాకు ఫోన్ చేసి అలా మాట్లాడవద్దు అంటూ చెబుతోంది, అలాగే తాము నిర్దోషులమని  నిరూపించుకొనే సాక్షాలు కూడా తమ వద్ద ఉన్నాయంటూ మాట్లాడుతోందట.

అతన్ని విమర్శించిన వారంతా కూడా అతని నిర్దోషిత్వ గురించి చాలా గొప్పగా చెబుతున్నారు.. మైనర్ బాలికతో శృంగారంలో పాల్గొనడం చాలా తప్పు.. అలాంటి వాటిని మీరు సమర్థిస్తున్నట్టు అవుతుంది. ఒకవేళ కోర్టు తీర్పు కూడా వారికి అనుకూలిస్తే, వారందరూ కూడా భారీ స్థాయిలోనే విజయోత్సవం జరుపుకుంటారు.. ఇక మీదట మైనర్లను వేధించిన తప్పించుకోవచ్చు అందుకు సంబంధించి ఏం చేయాలో వారికి కచ్చితంగా తెలుస్తుంది.. నేను కోరుకునేది ఏమిటంటే ఆ అమ్మాయి కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నా అంటూ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: