తెలుగు చిత్ర పరిశ్రమలో తన నటనతో ప్రత్యేకమైన గుర్తింపును సాధించిన నాచురల్ స్టార్ నాని, ఇప్పటివరకు ఎన్నో విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను అలరించాడు. అయితే ఇప్పుడు ఆయన తన కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న మోస్ట్ అవెయిటెడ్ సినిమా “ది ప్యారడైజ్”తో సినీ ప్రపంచంలో కొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని ప్రతిభావంతుడైన యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన ముందుగా తెరకెక్కించిన చిత్రాలతోనే తన సృజనాత్మకతను, గ్రాండ్ విజన్‌ను నిరూపించుకున్నాడు. ఇప్పుడు నానితో చేస్తున్న ఈ సినిమా ద్వారా తన విజువల్ స్కేల్, ఎమోషనల్ స్టోరీటెల్లింగ్ రెండింటినీ కొత్త స్థాయికి తీసుకెళ్లబోతున్నాడని ఇండస్ట్రీ టాక్.సినిమా ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మేకర్స్ మాత్రం ఎక్కడా రాజీ పడకుండా, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో సినిమాను రూపొందిస్తున్నారు. ప్రతి సన్నివేశం, ప్రతి లొకేషన్‌లోనూ గ్రాండియర్ కనిపించాలనే ఉద్దేశంతో భారీ ఖర్చులు పెట్టడానికి కూడా వెనుకాడట్లేదు.

ఇదే క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ఒక హైలైట్ విషయం బయటకి వచ్చింది .  ఒక్క సెట్ కోసమే సుమారు 12 కోట్ల రూపాయలకుపైగా ఖర్చు అవుతున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోని ప్రముఖ స్టూడియోలో ఓ రాజమహల్ తరహా ప్యాలెస్ సెట్ను ప్రత్యేకంగా నిర్మిస్తున్నారట. దాదాపు నెలల తరబడి ఆ సెట్ డిజైన్ వర్క్, ఆర్ట్ డైరెక్షన్ పనులు కొనసాగాయని తెలిసింది. అంత భారీ ఖర్చు ఒకే సెట్ మీద పెట్టడం చూసి సినీ వర్గాలు షాక్ అవుతున్నాయి. “నాని ఇప్పటివరకు ఇంత లావిష్‌గా, ఇంత గ్రాండ్‌గా సినిమా చేయడం ఇదే మొదటిసారి” అని చాలామంది అంటున్నారు. కొందరు అయితే సరదాగా — “ఈ సెట్ బడ్జెట్‌తో ఒక మంచి మిడిల్ రేంజ్ సినిమా తీయొచ్చు” అంటూ కామెంట్ చేస్తున్నారు.

అయినా మేకర్స్ మాత్రం సినిమా విజువల్ ఎక్స్‌పీరియెన్స్‌ కోసం ఏమాత్రం రాజీ పడడం లేదట. “ది ప్యారడైజ్”ను పాన్ ఇండియా మాత్రమే కాకుండా పాన్ వరల్డ్ లెవెల్లో ఉందబోతుంది అంటున్నారు అభిమానులు. ఈసినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఆయన కంపోజ్ చేసిన కొన్ని బ్యాక్‌గ్రౌండ్ థీమ్‌లు యూనిట్‌లో విన్నవారికి గూస్‌బంప్స్ తెప్పించాయని సమాచారం. నాని సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అంటేనే అంచనాలు రెట్టింపు అయ్యాయి.ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ఎస్‌ఎల్‌వి సినిమాస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ప్రొడక్షన్ వాల్యూస్, టెక్నికల్ టీమ్, ఆర్ట్ వర్క్ — అన్నీ టాప్ నోచ్‌గా ఉన్నాయని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: