ఈ క్రమంలోనే మంగళవారం అర్ధరాత్రి రోజున మంత్రి కొండా సురేఖ తన సోషల్ మీడియా వేదికగా నాగార్జునకు క్షమాపణలతో ఒక ట్విట్ చేసింది. ఈ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేయలేదని తనకు నాగార్జున గాని, ఆయన కుటుంబాన్ని కానీ కించపరచాలని ఆలోచన లేదంటూ తెలియజేసింది. తాను గతంలో చేసిన ఈ వ్యాఖ్యలను తాను ఉపసంహరించుకున్నట్లుగా తెలియజేసింది. ఈ సమయంలోనే నాగార్జునా పరువు నష్టం కేసును విత్డ్రా చేసుకున్నట్లుగా వినిపిస్తోంది. ఇందుకు సంబంధించి నాంపల్లి కోర్టుకు కూడా నాగార్జున తెలియజేశారట. మరి ఈ విషయంపై నాగార్జున అఫీషియల్ గా తెలియజేస్తారేమో చూడాలి. ఈ విషయం అటు ఇండస్ట్రీలో రాజకీయాలలో వైరల్ గా మారింది.
నాగార్జున ఈ ఏడాది కుబేర, కూలీ సినిమాలతో మంచి విజయాలను అందుకున్నారు. ప్రస్తుతం తన వందవ చిత్రాన్ని ప్రముఖ తమిళ డైరెక్టర్ రా కార్తీక్ తో చేయబోతున్నట్లుగా వినిపించాయి. స్క్రిప్ట్ పరంగా కూడా ఓకే అయినట్లుగా వినిపిస్తోంది. ఈ చిత్రంలో ఏకాంగ నాగార్జున ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయబోతున్నట్లు వినిపిస్తున్నాయి. వందవ సినిమా కోసం అభిమానులు చాలా ఎక్సైటింగ్ గానే ఎదురు చూస్తున్నారు. నాగార్జున ఒకవైపు బిగ్ బాస్ షో కి హొస్టుగా వ్యవహరిస్తున్నారు. అలాగే శివ సినిమా రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్ లో కూడా బిజీగా ఉన్నట్టు కనిపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి