స్టోరీ విషయానికి వస్తే:
అయ్య(సముద్రఖని) ఒక పేరు మోసిన డైరెక్టర్. తన తల్లి జీవిత కథ ఆధారంగా శాంత అనే చిత్రాన్ని తీయాలనుకుంటారు. ఇందులో తన శిష్యుడైన టికే.మహాదేవన్(దుల్కర్ సల్మాన్) హీరో, కానీ ఆ సినిమా మధ్యలో ఆగిపోతుంది. మళ్ళీ కొన్నేళ్ల తర్వాత తిరిగి ఆ సినిమాని పునః ప్రారంభం చేస్తారు. కానీ ఈసారి కూడా ఇందులో హీరోగా మహాదేవనే. అయితే ఈసారి తను చెప్పిన క్లైమాక్స్ తోనే ఈ చిత్రాన్ని తీయాలి అంటూ కండిషన్ పెట్టి మరి ఈ సినిమాలో నటిస్తారు మహదేవన్. ఈ చిత్రానికి శాంత బదులుగా కాంత అని సూచిస్తారు. దీంతో డైరెక్టర్ కూడా తన తల్లి కథని తెరపై చూడాలనే ఆశతో అన్ని షరతులకు ఒప్పుకుంటారు. అలా సినిమాని ప్రారంభిస్తారు అయ్య.
అయితే ఈ సినిమా సెట్లో మాత్రం అటు డైరెక్టర్ హీరోకి ఒకరంటే ఒకరు పడదు. ఇద్దరి మధ్య ఎటువంటి మాటలు లేకుండానే ఈ సినిమాని షూటింగ్ చేస్తుంటారు. అయితే వీరిద్దరికీ సయోధ్యకు ప్రయత్నం చేస్తూ ఉంటుంది కుమారి (భాగ్యశ్రీ బోర్సే). సినిమా అయిపోయే దశలో ఒక పెద్ద సమస్య వస్తుంది. అదేమిటంటే ఈ సినిమాలో ఒక కీలకమైన వ్యక్తి హత్యకు గురవుతారు. ఈ హత్య చేసింది నువ్వంటే నువ్వు అంటూ అటు డైరెక్టర్, హీరో ఒకరి పైన ఒకరు చెబుతూ ఉంటారు. అసలు ఈ హత్య ఎలా జరిగిందని కనిపెట్టేందుకు ఇన్స్పెక్టర్ దేవరాజ్ (రానా) రంగంలోకి దిగిన తర్వాత ఎలా కనుక్కున్నారు? హత్య చేయడానికి గల కారణాలు ఏంటి? గురు శిష్యుల మధ్య సంబంధాలు అంతగా చెడిపోవడానికి పరిస్థితులు ఏంటి అన్నది సినిమా కథ .
ఎలా నటించారంటే:
నటి చక్రవర్తి మహాదేవన్ పాత్రలో హీరో దుల్కర్ సల్మాన్ అద్భుతంగా నటించారు. ముఖ్యంగా ఆయన కనిపించిన తీరు సహజంగానే ఉంది. దుల్కర్ సల్మాన్ ఈ సినిమాతో మరొక మెట్టు పైకి ఎదిగారని చెప్పవచ్చు. అయ్య పాత్రలో సముద్రఖని అద్భుతంగా నటించారు. రెండు కోణాలలో సాగే ఈ పాత్రలో రాజీపడని డైరెక్టర్గా అద్భుతంగా నటించారు. ఈ సినిమాలోని ఎక్కువ భాగం హీరో ,డైరెక్టర్ మధ్య కొనసాగుతాయి. రెండవ భాగంలో రానా దగ్గుబాటి తన నటనతో మరి ఆకట్టుకున్నారు. కథానాయక కుమారి పాత్రలో భాగ్యశ్రీ బోర్సే అందం అభినయంతో ఆకట్టుకుంది. తనకి వచ్చిన మొదటి అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంది.. ముఖ్యంగా దుల్కర్, భాగ్య మధ్య కెమిస్ట్రీ కూడా హైలెట్ గా పండింది.డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ అద్భుతంగా తెరకెక్కించారు.
బలాలు:
కథలో మలుపులు
దుల్కర్ సల్మాన్ యాక్టింగ్
విజువల్స్
మైనస్:
సుదీర్ఘంగా సాగే క్రైమ్ పరిశోధన
కాంత సినిమాలో రక్తికట్టించే డ్రామాతో సినిమాలో సినిమా
రేటింగ్:
2.8/5
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి