మాస్ మహారాజా రవితేజ కొన్ని సంవత్సరాల క్రితం వరుస పెట్టి విజయాలను అందుకుంటూ వచ్చాడు. ఆయన హీరోగా రూపొందిన సినిమాలు సంవత్సరానికి రెండు , మూడు ఈజీగా విడుదల అవుతూ వచ్చేవి. అందులో ఒకటి , రెండు ఫెయిల్యూర్ అయినా కూడా ఏదో ఒక సినిమా మంచి విజయం సాధించేది. దానితో ఆయన వరుసగా ఎన్ని సినిమాల్లో చేసిన కూడా ప్రేక్షకులు కూడా పెద్దగా వాటిని పట్టించుకునేవారు కాదు. రవితేజ సంవత్సరానికి ఎన్ని సినిమాలతో వచ్చిన అందులో కనీసం ఒకటి , రెండు సినిమాలతో మంచి విజయాలను అందుకుంటాడు అని అనుకునేవారు.

కానీ ఈ మధ్య కాలంలో రవితేజ వరుస పెట్టి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న అందులో చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అవుతున్నాయి. గత కొంత కాలంగా రవితేజకు చాలా అపజయాలు వచ్చాయి. దానితో అనేక మంది రవితేజ కాస్త స్లో గా సినిమాలు చేస్తే బాగుంటుంది. ఒక సినిమా విడుదల అయ్యాక దానిని రిజల్ట్ ని బట్టి మరో సినిమాను ఓకే చేస్తే చాలా బాగుంటుంది అని అభిప్రాయ పడుతున్నారు. రవితేజ మాత్రం అదే జోష్లో ముందుకు వెళుతున్నాడు. తాజాగా రవితేజ నటించిన మాస్ జాతర సినిమా విడుదల అయింది.

సినిమా విడుదల కాక ముందే కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ మూవీ స్టార్ట్ చేశాడు. ఇక మాస్ జాతర సినిమా ఫ్లాప్ అయ్యింది. ఇక కిషోర్ తిరుమల దర్శకత్వంలో ప్రస్తుతం రవితేజ "భర్త మహాశయులకు విజ్ఞప్తి" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమా విడుదల కాక ముందే శివ నిర్వాన దర్శకత్వంలో ఈ నెల చివర నుండి మరో సినిమాను స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దానితో అనేక మంది రవితేజ కాస్త స్లో గా సినిమాలు చేస్తే బాగుంటుంది అని అభిప్రాయాలను మరోసారి వ్యక్త పరుస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rt