ఐబొమ్మ పైరసీ కేసులో నిందితుడిగా అరెస్టైన ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గత రెండు రోజులుగా కస్టడీలోకి తీసుకుని తీవ్రంగా విచారిస్తున్నారు. రెండో రోజు విచారణలో భాగంగా అధికారులు అతనిని ఎర్రగంటలపాటు ప్రశ్నించారని సమాచారం. ఈ విచారణలో నుంచి పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. పైరసీ నెట్‌వర్క్‌కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు, ఆయా లింకులు, ఇతరులకు ఉన్న సంబంధాలు వంటి అంశాలను పోలీసులు సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని టాక్.


అయితే మరోవైపు, రవికి సోషల్ మీడియాలో అనూహ్యంగా భారీ స్థాయిలో మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా సాధారణ ప్రజలు, యువత పెద్ద ఎత్తున అతనికి సపోర్ట్ ఇస్తున్నారు. సినిమా టికెట్ రేట్లు రోజురోజుకు పెరిగి సామాన్య ప్రేక్షకులకి అందుబాటు దూరమవుతున్న తరుణంలో, కొత్త సినిమాలను ఇంటికే తీసుకురావడంలో రవి “సామాన్యుడి హీరో”లా వ్యవహరించాడని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దాంతో, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫార్ములలో వేలాది మంది రవికి మద్దతుగా వీడియోలు, పోస్టులు షేర్ చేస్తూ ట్రెండింగ్ క్రియేట్ చేస్తున్నారు.



ఇలాంటి పరిస్థితుల్లో, ప్రజలు రవిని ఒక హీరోగా, సోషల్ మీడియా స్టార్‌గా ఎలివేట్ చేస్తుండటంపై ప్రముఖ నిర్మాత బన్నీ వాసు స్పందించారు. ఓ మూవీ ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన ఆయన, రవిని హీరోగా చూపించడం, అతనికి దేవుడిలా ఎలివేషన్ ఇవ్వడం పూర్తిగా తప్పని స్పష్టం చేశారు. పైరసీకి మద్దతుగా మాట్లాడటం చట్టవిరుద్ధమని, అది ఏ కోణంలోనూ సమర్థించలేనిదని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. అంతేకాక, రవి చేసిన పైరసీ చర్యల వలన సినీ ఇండస్ట్రీకి కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని బన్నీ వాసు ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాన్ని అతిక్రమించిన వ్యక్తిని హీరోలా చూపించడం సమాజానికి తప్పు సందేశం ఇస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రవిని “సోషల్ మీడియా దేవుడు”గా చూడటం ఆపాలని, చట్టాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత అని నిర్మాత బన్నీ వాసు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: