1970ల కాలం... బాలీవుడ్‌లో హాటెస్ట్ జంటగా ఎదిగినది ధర్మేంద్ర–హేమమాలినీ జోడి. ఇది అందరికి తెలిసిన విషయమే వరుసగా చేసిన చిత్రాలు, స్క్రీన్‌పై కనిపించిన సహజమైన ప్రేమ కెమిస్ట్రీ ఈ ఇద్దరిని ఒకరికొకరు మరింత దగ్గర చేసాయి. ప్రత్యేకంగా సీతా ఔర్ గీత, షోలే వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు వచ్చిన తర్వాత, వీరి జంటపై సినీప్రియుల్లో ప్రత్యేక ఆసక్తి పెరిగింది. అప్పటి సినిమాల సెట్‌ల్లో వీరి మధ్య జరిగే చిన్న చిన్న ముచ్చట్లు, నవ్వులు, కలిసి గడిపిన సమయాలు చాలా సహచరులు చెప్పుకునే విషయాలయ్యాయి. అదేవిధంగా, ‘షోలే’ చిత్రీకరణ సమయంలో ధర్మేంద్ర - హేమమాలినిపై ఎంత ప్రేమలో ఉన్నాడో అనేక కథలు అప్పట్లో బయటకొచ్చాయి.

 
ముఖ్యంగా హేమను కౌగిలించుకునే సీన్లను మరిన్ని టేకులు రావాలనే ఉద్దేశంతో ధర్మేంద్ర లైట్ బాయ్స్‌కు డబ్బులు ఇచ్చేవారని అప్పటి వార్తలు బాగా ప్రచారం అయ్యాయి. తన ఇష్టమైన సీన్‌ను కొద్ది సేపు అయినా ఎక్కువగా షూట్ చేయడానికి సుమారు రూ. 2000 వరకు ఖర్చు పెట్టాడని కూడా ఆ రోజుల్లో గాసిప్స్ వెల్లువెత్తాయి. సినిమా షూట్‌లో హీరోలు హీరోయిన్లపై క్రష్‌లు పెట్టడం సాధారణమైన విషయమే అయినా, ధర్మేంద్ర చూపిన ఈ స్థాయి ఆకర్షణ మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ, ఇక్కడితో కథ ముగియలేదు. ధర్మేంద్ర–హేమమాలినీ ప్రేమ పెరుగుతున్న కొద్దీ, ఈ ప్రేమను వివాహంగా మార్చుకోవాలనే ఆలోచన ఆయన మనసులో బలపడింది. అయితే ధర్మేంద్రకి అప్పటికే భార్య ప్రకాశ్ కౌర్, పిల్లలు సన్నీ డియోల్, బాబీ డియోల్ ఉన్నారు. అందువల్ల రెండో పెళ్లిని ప్రకాశ్ కౌర్ అంగీకరించలేదు. కుటుంబంలో కలవరం మొదలయ్యింది.



ఈ పరిస్థితుల్లోనే ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నాడని అప్పటి మీడియాలో వచ్చిన నివేదికలు పేర్కొన్నాయి. ధర్మేంద్ర ఇస్లాం మతం స్వీకరించి, ‘దిలావర్ ఖాన్’ అనే పేరుతో 1980లో హేమమాలినిని వివాహం చేసుకున్నాడని ఆ రోజుల్లో తీవ్రంగా ప్రచారం జరిగింది. ఒకే సమయంలో ఇద్దరి భార్యలను స్వీకరించడానికి ఇస్లాం చట్టం అనుమతించడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని అప్పటి కథనాలు తెలియజేశాయి. ఇది బాలీవుడ్‌లో పెద్ద సంచలనంగా మారిన ఘటన. ఈ వ్యహారం ధర్మేంద్ర మొదటి కుటుంబంపై, ముఖ్యంగా సన్నీ డియోల్ మరియు బాబీ డియోల్ మీద కూడా బలమైన ప్రభావం చూపిందని పలువురు చెబుతారు. రెండు కుటుంబాలను బ్యాలెన్స్ చేయడానికి ధర్మేంద్ర ఎన్నో సంవత్సరాలు ఇబ్బంది పడ్డాడని, తన రెండు జీవితాలను సమాంతరంగా నడపడంలో కష్టాలు ఎదుర్కొన్నాడని అప్పటి పత్రికలు పేర్కొన్నాయి.


ఏదేమైనప్పటికీ… ధర్మేంద్ర–హేమమాలినీ ప్రేమకథ బాలీవుడ్‌లో ఇప్పటికీ అత్యంత చర్చనీయాంశమైన, నాటకీయమైన, భావోద్వేగాలతో నిండిన ప్రేమగాథలలో ఒకటిగా నిలిచిపోయింది. కాలం గడిచినా, వీరి మధ్య ఉన్న బంధం, ప్రేమ మరియు ధర్మేంద్ర చేసిన త్యాగాల గురించి అభిమానులు ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: