జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించిన తాజా చిత్రం ‘దేవర’తో మరోసారి కొరటాల శివ గొప్ప సక్సెస్‌ని అందుకున్నారు. సినిమా భారీ హైప్‌తో విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. త్వరలోనే ‘దేవర 2’ కూడా సెట్స్‌పైకి రావాల్సి ఉంది. అయితే, జూనియర్ ఎన్టీఆర్ తన ఇతర కమిట్‌మెంట్స్ వల్ల ప్రస్తుతం కొరటాల శివకు డేట్స్ ఇవ్వలేకపోతున్నారట. దీనివల్ల ‘దేవర 2’ కొన్ని రోజులు పక్కన పడిపోయింది.ఈ మధ్య ఖాళీ సమయంలో కొత్త హీరో కోసం సెర్చ్ చేస్తూ, కథకు సరిపడే స్టార్‌ను ఎంపిక చేయడానికి కొరటాల శివ ప్రయత్నాలు ప్రారంభించినట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగానే, నందమూరి నటసింహం బాలకృష్ణ మీద ఆయన కన్నేశారట!
ఇప్పటికే కొంతకాలం క్రితమే ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతుందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే టాక్ వేగంగా వైరల్ అవుతోంది. బాలకృష్ణతో ఒక పవర్‌ఫుల్ పొలిటికల్ డ్రామా చేయాలని కొరటాల శివ అలోచిస్తున్నారట. ఈ కథను పూర్తి చేసే లోపు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఫ్రీ అయ్యే ఛాన్స్ ఉండడంతో, టైమ్‌ని వృథా చేయకుండా బాలయ్యతో సినిమా పూర్తి చేయాలన్నదే కొరటాల శివ ప్లాన్‌గా తెలుస్తోంది.ఇప్పటికే ఈ కాంబినేషన్‌పై ప్రారంభ చర్చలు కూడా జరగుతున్నాయన్న సమాచారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి అయితే, త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిజంగానే బాలయ్య – కొరటాల శివ కాంబినేషన్ ఓకే అయితే? అప్పుడు థియేటర్లు బద్దలయ్యే హంగామా గ్యారంటీ అని సినీ వర్గాలు చెబుతున్నాయి. బాలయ్య యొక్క మాస్ ఇమేజ్, కొరటాల శివ స్టోరీ టెల్లింగ్ కలిస్తే బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులు తప్పవని ఫ్యాన్స్ పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు.ఇక చూడాలి… ఈ కాంబో నిజం కావడం ఎప్పుడో!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి