పెళ్లి తర్వాత కూడా తమ అందం, ప్రతిభ, పనితీరు—ఏ విషయంలోనూ తగ్గకుండా అటు సినిమాలు, ఇటు బ్రాండ్ ప్రమోషన్లు అంటూ కెరీర్‌ను దూసుకుపోతున్న హీరోయిన్ కీర్తి సురేశ్. వివాహం తర్వాత చాలా మంది నటీమణుల కెరీర్‌లో ఒక నెమ్మదితనం కనిపించేది గతంలో. కానీ ఆ కాలం ముగిసిపోయింది అని చెప్పాలంటే కీర్తి సురేశ్‌ స్పష్టమైన ఉదాహరణ. ఇప్పటికీ ఆమెకు సినిమాల ఆఫర్లే కాకుండా వెబ్ ప్రాజెక్టులు, అడ్వర్టైజ్‌మెంట్లు, ఫోటోషూట్లు అంతా వరుసగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆమె ప్రతి ప్రాజెక్ట్ ప్రమోషన్స్‌లోనూ పూర్తిగా పాల్గొంటూ వివిధ నగరాలకు ప్రయాణిస్తూ ఉంటుంది.


తాజాగా ఆమె నటించిన మహిళా ప్రాధాన్య చిత్రమైన ‘రివాల్వర్ రీటా’ ప్రచార కార్యక్రమం కోసం హైదరాబాద్‌కు వచ్చిన కీర్తి అక్కడ మీడియాతో మాట్లాడింది. సాధారణంగా ప్రమోషన్ ఈవెంట్లలో సినిమా గురించి, పాత్ర గురించి, షూటింగ్ అనుభవాల గురించి ప్రశ్నలు వస్తాయి. కానీ ఈసారి మాత్రం ఒక పాత వ్యాఖ్య మళ్లీ ఆమె ముందు తెరపైకి వచ్చింది.గతంలో ఒక ఇంటర్వ్యూలో కీర్తి —“చిరంజీవి కంటే ఇళయ దళపతి విజయ్ డ్యాన్స్ నాకు ఇష్టం” అని చెప్పింది. దీంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చే అయింది. ఆ మాటపై కొంతమంది మెగాస్టార్ అభిమానులు అప్పట్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఈ హైదరాబాద్ ఈవెంట్‌లో ఓ జర్నలిస్ట్ మరోసారి ప్రస్తావించాడు. ఆ వ్యాఖ్య చిరు గారిని అవమానించినట్లేనా? ఆయన అభిమానులు బాధపడ్డారా? అన్న ప్రశ్నలతో కీర్తిని నిలదీశారు.



అలాంటి పరిస్థితుల్లో చాలామంది స్టార్ హీరోయిన్లు మాట మళ్లించేందుకు ప్రయత్నిస్తారు. కానీ కీర్తి మాత్రం ఎప్పటిలాగే సున్నితంగా కానీ ధైర్యంగా స్పందించింది. “నేను చిన్నప్పటి నుంచే విజయ్ గారి పెద్ద ఫ్యాన్‌ని. ఆయన డ్యాన్స్‌ తీరులో నాకు ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. అందుకే అభిమానిగా మాట్లాడిన మాటను అప్పట్లో చెప్పాను. అది ఎట్టి పరిస్థితుల్లోనూ చిరంజీవి గారిని తగ్గేలా చెప్పిన మాట కాదు,” అంటూ మొదలుపెట్టిన ఆమె నిజమైన సంఘటనను బయటపెట్టింది.



“ఇదే విషయాన్ని చిరంజీవి గారు నాకు వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు వివరించాను. ఆయన చాలా సింపుల్‌గా, నవ్వుతూ ‘పర్లేదు… ప్రతి ఒక్కరికి తమ తమ ఇష్టాలు ఉంటాయి కదా’ అని చెప్పారు. నేను చెప్పిందే ఫ్యాన్ గర్ల్ గా చెప్పిన మాట అని అర్థం చేసుకుని మరీ ప్రశంసించారు,” అని కీర్తి చెప్పింది.అంతటితో ఆగకుండా మెగా అభిమానులపైనా ఓ పాయింట్ చెప్పారు. “చిరు గారి ఫ్యాన్స్‌లో ఎవరికైనా నా కామెంట్ వల్ల హర్ట్ అయి ఉంటే నిజంగా సారీ. కానీ నేను ఇష్టాన్ని చెప్పడంలో వెనక్కు తగ్గాలని చెప్పడం మాత్రం కొంచెం బాధ కలిగిస్తుంది. అభిమానిగా ప్రేమతో చెప్పిన మాటను తప్పుగా తీసుకోవద్దు,” అని ఆమె స్పష్టంగా తెలిపింది. దీంతో కొంత మంది ఘాటుగా ట్రోలర్స్ పై రియాక్ట్ అవుతున్నారు ఆమె చెప్పింది..ఆయన ఓకే అన్నారు.. ఆయనకి లేని బాధ,నొప్పి మధ్యలో వాళ్లకి ఎందుకు అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: