తమిళ సినీ పరిశ్రమ సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా భారీ చిత్రం ‘జైలర్ 2’ పై ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తొలి భాగం విశేష విజయాన్ని సాధించిన తర్వాత, ఈ సీక్వెల్‌పై సహజంగానే అభిమానుల్లో ఉండే ఆసక్తి మరింతగా పెరిగింది. ముఖ్యంగా ఈ చిత్రాన్ని ‘జైలర్’తో సూపర్‌హిట్ అందించిన దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ మళ్లీ తెరకెక్కిస్తుండటంతో అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి. ఇప్పటికే ఈ సినిమాలో పలు స్టార్ హీరోలు, ప్రముఖ నటులు కేమియో పాత్రల్లో కనిపించబోతున్నారని చిత్ర యూనిట్ ముందుగానే సూచించింది. అయితే తాజా కోలీవుడ్ ఇండస్ట్రీ నుండిసమాచారం ప్రకారం మరో వెర్సటైల్ నటుడు, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం గోవాలో విజయ్ సేతుపతి పాల్గొన్న కొన్ని ముఖ్యమైన సీన్లను చిత్రబృందం శరవేగంగా షూట్ చేస్తోందని టాక్.


అయితే, విజయ్ సేతుపతి నిజంగానే ‘జైలర్ 2’లో భాగమా? అనే ప్రశ్నకు అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు. ఈ వార్తలు పూర్తిగా కోలీవుడ్ వర్గాల రూమర్స్‌గా మాత్రమే వినిపిస్తున్నాయి. కానీ అభిమానులలో మాత్రం ఈ అప్‌డేట్‌పై పెద్ద ఎలాంటి ఆసక్తి నెలకొంది. ఇక రజనీకాంత్ – విజయ్ సేతుపతి కాంబినేషన్ విషయానికి వస్తే, వీరిద్దరూ గతంలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘పెట్టా’ చిత్రంలో కలిసి నటించారు. ఆ సినిమా సమయంలో వచ్చిన స్పందన, విజయ్ సేతుపతి పోషించిన పాత్ర ప్రభావం కారణంగా, ఈసారి మళ్లీ వీరిద్దరూ కలిసి కనిపిస్తారన్న వార్త మరింత హైప్ క్రియేట్ చేస్తోంది.



ఐతే ఇప్పటికే ఈ సినిమాలో ముగ్గురు ప్రముఖ స్టార్లు ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నట్లు ఒక న్యూస్ కొన్ని రోజుల క్రితమే బయటకు వచ్చింది. ఇప్పుడు మరో పెద్ద పేరు ఈ సినిమాలో చేరతారని ప్రచారం రావడంతో, సోషల్ మీడియాలో ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. “ఈ సినిమాలోకి ఇంకా ఎంత మంది స్టార్స్‌ని తీసుకొస్తావు డైరెక్టర్?” అంటూ నెల్సన్‌ను టార్గెట్ చేస్తూ నెటిజన్లు సరదాగా ట్రోల్ చేస్తూ మీమ్‌స్ తయారు చేస్తున్నారు. అయినా కూడా ఈ మొత్తం ప్రచారం ‘జైలర్ 2’ కోసం ఏర్పడిన భారీ ఆసక్తిని స్పష్టంగా చూపిస్తోంది. అభిమానులు, ట్రేడ్ వర్గాలు, సినీ ప్రేమికులు—అందరూ ఒకేసారి ఈ చిత్రానికి సంబంధించి రావాల్సిన అధికారిక అప్‌డేట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: