లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. రిమాండ్ ఖైదీగా కొద్ది రోజులు జైలు శిక్ష కూడా అనుభవించారు. అయితే బెయిల్ పైనుంచి బయటికి వచ్చిన తర్వాత అవకాశాలు రావనుకున్న సమయంలో తిరిగి మళ్ళీ సినిమాలలో బిజీగా మారారు జానీ మాస్టర్, తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా అవకాశాలను అందుకున్నారు. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. గతంలో కూడా జానీ మాస్టర్ కు ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులు వచ్చాయి.


ముఖ్యంగా నేషనల్ అవార్డుకు కూడా ఎంపికయ్యారు. ఆ తర్వాత లైంగిక ఆరోపణలు ఎదురవ్వడంతో ఆ అవార్డు వెనక్కి వెళ్ళిపోయింది. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత కొరియోగ్రాఫర్ గా బిజీగా మారిన జానీ మాస్టర్. రామ్ చరణ్ నటించిన పెద్ది చిత్రంలో చికిరి చికిరి సాంగ్ భారీ క్రేజ్ తెచ్చి పెట్టింది. ఇప్పుడు తాజాగా జానీ మాస్టర్ కు క్రియేటివ్ కొరియోగ్రాఫర్ గా అవార్డు లభించింది. కర్ణాటకకు చెందిన చిత్తారా మీడియా ఈ అవార్డుని అందించింది. ఈ అవార్డుతో కలిసి జానీ మాస్టర్ దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చారు.


ఈ అవార్డు నన్ను ఎంపిక చేసినందుకుగాను చిత్తారా మీడియాకు ప్రత్యేకించి మరి ధన్యవాదాలు అంటూ తెలిపారు జానీ మాస్టర్. నాకు ఇలాంటి అవకాశాలు  కల్పించిన దర్శక ,నిర్మాతలకు ,నటీనటులకు, టెక్నీషియన్లకు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు వారి పూర్తి మద్దతు తెలియజేస్తున్నందుకు ఎప్పటికీ తాను రుణపడి ఉంటానని.. ఇలా మీరు అందిస్తున్న ఆదరాభిమానాలతోనే తాను భవిష్యత్తులో మంచి కొరియోగ్రాఫర్ గా ఎదుగుతానని మాట ఇస్తున్నానని జానీ మాస్టర్ తెలియజేశారు. అయితే ఈ అవార్డు అందుకోవడంతో  కొంతమంది  ప్రశంశలు కురిపించగా, మరికొంతమంది జానీ మాస్టర్ పైన నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: