ఈ సినిమా ట్రైలర్, టీజర్, సాంగ్స్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలో హీరో రామ్ అభిమాని పాత్రలో అద్భుతంగా నటించారు..అలాగే ఆంధ్రా కింగ్ సూర్య కుమార్ పాత్రలో ఉపేంద్ర కూడా అద్భుతంగా నటించారు. భాగ్యశ్రీ కూడా తన పాత్రలో అద్భుతంగా నటించేసింది. ముఖ్యంగా సినిమా ప్రమోషన్స్ లో కూడా చిత్ర బృందం విస్తృతంగానే పాల్గొన్నారు.
ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలో సూపర్ స్టార్ రోల్కు ఉపేంద్ర ఫస్ట్ ఛాయస్ కాదని వినిపిస్తోంది. ముందుగా ఈ సినిమాలోని ఈ పాత్ర కోసం బాలకృష్ణను సంప్రదించినట్లు వినిపిస్తోంది. అయితే బాలయ్య చేతిలో ప్రస్తుతం వరుస సినిమాలు ఉండడం చేత, డేట్లు అడ్జస్ట్ కాకపోవడంతో ఇందులో బాలయ్య నటించలేకపోయారట. దీంతో వెంటనే చిత్ర బృందం ఉపేంద్రను కలవడంతో పాటు కథ విన్న తర్వాత ఆయనకు కూడా నచ్చడంతో ఆంధ్రా కింగ్ తాలూకా అని టైటిల్ ను ఫిక్స్ చేశారట చిత్రబృందం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం సినిమా విడుదలైన తర్వాత ఈ న్యూస్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తానికి ఈ సినిమాతో రామ్ హిట్ కొట్టారని అభిమానులు భావిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి