రామ్ మాట్లాడుతూ.. ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా కోసమే తాను ప్రత్యేకించి ఒక ప్రేమ గీతం రాశాను అప్పటినుంచే భాగ్యశ్రీ తో ప్రేమ అంటూ రూమర్స్ మొదలయ్యాయి.. ముఖ్యంగా హీరోయిన్ తో ప్రేమ లేనిదే ఇంత గొప్ప పాట ఎలా రాయగలడు! అంటూ అందరూ అనుకున్నారు.. అసలు నిజం ఏమిటంటే ఈ సినిమాలో హీరోయిన్ ని ఎంపిక చేయకముందే తాను ఈ పాట రాశానని ఈ సినిమాలో హీరో, హీరోయిన్ల పాత్రలను ఊహించుకొని లిరిక్స్ రాసేశాను కానీ ఈ పాట విడుదలైన తర్వాత అందరూ మరొక లాగా అనుకున్నారంటూ రామ్ తెలియజేశారు. తమ ఇద్దరి మధ్య ఏమీ లేదు కేవలం అవన్నీ రూమర్స్ మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చారు.
ఈ విషయం పైన భాగ్యశ్రీ కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రామ్ తనకు మంచి స్నేహితుడని ఒక నటుడుగా ఆయన అంటే చాలా గౌరవం ఆయన వర్క్ డెడికేషన్ చూసి ఎంతో నేర్చుకున్నాను అంతకుమించి తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదంటూ క్లారిటీ ఇచ్చింది. మొత్తానికి ఇద్దరు క్లారిటీ ఇవ్వడంతో ఇవి రూమర్స్ గాని మిగిలిపోయాయి. డైరెక్టర్ పి.మహేష్ బాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా లో ఉపేంద్ర కీలకమైన పాత్రలో నటించారు. మరి మొదటి రోజు ఎన్ని కోట్ల రూపాయలు కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి