ప్రస్తుతం ఎక్కడ చూసినా “ఆంధ్రా కింగ్ తాలుకా” గురించే చర్చ నడుస్తోంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ లేటెస్ట్ మచ్ అవైటెడ్ ప్రాజెక్ట్ విడుదలైన వెంటనే మంచి బజ్‌ను సంపాదించుకుంది. సినిమా కథ పెద్దగా కొత్తదనం లేకపోయినా, రామ్ పోతినేని ఎనర్జెటిక్ నటన, భాగ్యశ్రీ అందాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రామ్ కెరీర్‌లో మళ్లీ అదే పాత ఎనర్జీ కనిపించిందని సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సినిమా చూసిన వారంతా “ఇది రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అవుతుంది” అని ధీమాగా చెబుతున్నారు.


ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంచనాల ప్రకారం, ఆంధ్రా కింగ్ తాలుకా ఫస్ట్ డే కలెక్షన్స్ 37 కోట్లకు పైగా ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. రామ్ పోతినేని కెరీర్‌లో ఇప్పటివరకు ఇలాంటి హై రేంజ్ ఓపెనింగ్ రికార్డు లేనప్పటికీ, ఈ సినిమా ఆ గ్యాప్‌ను ఫిల్ చేస్తుందని అభిమానులు నమ్ముతున్నారు.రామ్ అభిమానులు సోషల్ మీడియాలో ఈ కలెక్షన్స్‌ను షేర్ చేస్తూ భారీ హంగామా సృష్టిస్తున్నారు. “మన హీరో కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ ఇదే”, “ఇది ఇంకా స్టార్ట్ మాత్రమే” అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు చూడాల్సినది ఏమిటంటే…ఫ్యాన్స్ ఇలా ధీమాగా చెబుతున్న అంచనాలు నిజమవుతాయా లేదా? ఆంధ్రా కింగ్ తాలుకా వసూళ్లు నిజంగా రామ్ కెరీర్‌లోని అతిపెద్ద రికార్డ్‌గా నిలుస్తాయా? ఏదేమైనా, సోషల్ మీడియాలో ఈ సినిమా హైప్ మాత్రం భారీ స్థాయిలో వైరల్ అవుతోంది.



గత కొంత కాలంగా రామ్ పోతినేనికి హిట్ నే లేదు. ఈసారి మాత్రం కూసింత గట్టిగా ఘాటుగానే కొట్టేశాడు రామ్. ఇక రామ్ పోతినేని నుండి వచ్చే నెక్స్ట్ సినిమాలు అద్దిరిపోతాయి అంటూ ఆయన కటౌట్స్ ని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: