టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుస విజయాలు సాధించిన రామ్ కు ఈ మధ్య కాలంలో వరుసగా భారీ షాకులు తగిలాయి. అయితే మైత్రీ  మూవీ మేకర్స్ బ్యానర్ లో పి.మహేష్ బాబు డైరెక్షన్ లో తెరకెక్కిన ఆంధ్ర కింగ్ తాలూకా  సినిమాపై మాత్రం మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్ లోనే సినిమా ఏ విధంగా ఉండబోతుందో క్లారిటీ వచ్చినా కొత్తదనంతో కూడిన సినిమా చూడాలని భావించే ప్రేక్షకులు మెచ్చేలా  ఆంధ్ర కింగ్ తాలూకా  తెరకెక్కింది.  ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందో లేదో ఇప్పుడు చూద్దాం.

కథ :

సాగర్ (రామ్ పోతినేని) తన అభిమాన హీరో సూర్యను(ఉపేంద్ర) ప్రాణానికి ప్రాణంగా అభిమానించే వీరాభిమాని.  అయితే ఆ అభిమానం వల్ల సాగర్ కు కొన్ని ఇబ్బందులు, అవమానాలు సైతం ఎదురవుతోంది. ఒకానొక దశలో తన ఫేవరెట్ హీరో సూర్య నటించిన  సినిమాలు  ఆశించిన ఫలితాలను అందుకోవు. సాగర్, సూర్య ఒకరికొకరు డైరెక్ట్ గా పరిచయం లేకపోయినా ఒకరి జీవితాలపై మరొకరు  ఏ విధంగా  ప్రభావం చూపారు? తన అభిమాన హీరో కోసం రామ్ ఏం చేశాడు? నిజ జీవితంలో స్టార్స్ ఫేస్ చేసే స్ట్రగుల్స్ ఏంటి? సాగర్ లవ్ స్టోరీ  ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

విశ్లేషణ :

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్లాస్ సినిమాలను అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించే దర్శకులు చాలా తక్కువమంది  ఉన్నారు. అలాంటి  దర్శకులలో పి.మహేష్ బాబు ఒకరు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాల కాన్సెప్ట్ లు రెగ్యులర్ సినిమాలకు భిన్నమైనవి. అయితే ఒకింత కష్టంతో కూడిన ఇలాంటి ప్రాజెక్ట్ లను నెక్స్ట్ లెవెల్ లో  తెరకెక్కించే విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. వరుస ఫ్లాపుల్లో ఉన్న రామ్ కు  భారీ విజయాన్ని అందించి దర్శకుడు ప్రామిసింగ్ డైరెక్టర్లలో  ఒకరిగా నిలిచారు.

హీరో రామ్ పోతినేని  ఎలాంటి పాత్రకైనా తన నటనతో ప్రాణం పోస్తారు.  ఈ సినిమా కోసం లుక్ ను సైతం మార్చుకున్న రామ్ రిస్కీ రోల్ అయినప్పటికీ అలవోకగా నటించారు.  సాగర్ పాత్రలో రామ్ కాకుండా మరే  హీరో నటించినా ఈ స్థాయిలో రెస్పాన్స్ అయితే వచ్చేది కాదని చెప్పవచ్చు.  రామ్ కెరీర్ లో ఈ సినిమా బెస్ట్ సినిమాగా నిలుస్తుంది. భాగ్యశ్రీ ఈ సినిమాకు ప్లస్ అయ్యారు.  
 
ఈ సినిమాకు మ్యూజిక్ ప్లస్ అయింది.  చిన్ని గుండెలో పాట  ఇప్పటికే ఊహించని స్థాయిలో హిట్ కాగా  తెరపై ఆ  పాట  మరింత అందంగా ఉంది. ఈ సినిమాలో ఉపేంద్ర పాత్ర నిడివి తక్కువైనా  సూర్య పాత్రకు ఉపేంద్ర ప్రాణం పోశారు. ఈ పాత్రకు ఉపేంద్ర ఎందుకు పర్ఫెక్ట్ ఛాయిస్  అనే విషయం సినిమా చూస్తే  అర్థమవుతుంది.  రావు రమేష్, మురళీ శర్మ, తులసి పాత్రలకు పర్ఫెక్ట్ గా నిలిచారు.

టెక్నీకల్ గా కూడా ఈ సినిమా బాగుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడలేదు.  వివేక్, మెర్విన్ మ్యూజిక్, బీజీఎంతో మెప్పించారు.  సిద్దార్థ్ నూని  సినిమాటోగ్రఫీ మూవీకి ప్లస్ అయింది.  శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే  బాగుండేది.

ప్లస్ పాయింట్స్ :

రామ్, భాగ్యశ్రీ యాక్టింగ్

మ్యూజిక్

ఫస్టాఫ్

మైనస్ పాయింట్స్ :

సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు


రేటింగ్ : 3.25/5.0

మరింత సమాచారం తెలుసుకోండి: