నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు బాక్సాఫీస్ వద్ద ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి కలయికలో వచ్చిన 'సింహా', 'లెజెండ్', 'అఖండ' చిత్రాలు బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. ముఖ్యంగా, 'అఖండ' సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో, ఇప్పుడు అదే కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'అఖండ 2'పై సినీ వర్గాల్లో, అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి.
'అఖండ 2' చిత్రాన్ని మేకర్స్ ఏకంగా 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. బోయపాటి తన మార్క్ యాక్షన్, ఎమోషన్స్‌తో ఈ చిత్రాన్ని మరింత గ్రాండ్‌గా, అద్భుతంగా రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బాలయ్య ద్విపాత్రాభినయం చేసే అవకాశాలు ఉన్నాయని, ఈసారి కథ మరింత శక్తిమంతంగా ఉండబోతోందని సినీ వర్గాల సమాచారం.
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, డిసెంబర్ మొదటి వారం రేసు నుంచి 'బైకర్' మూవీ తప్పుకోవడంతో, 'అఖండ 2' సినిమాకు మరిన్ని ఎక్కువ థియేటర్లలో విడుదలయ్యే అవకాశం దక్కింది. భారీ బడ్జెట్ చిత్రానికి, అందునా బాలకృష్ణ, బోయపాటి కాంబో మూవీకి ఎక్కువ థియేటర్లు లభించడం కలెక్షన్ల పరంగా బిగ్ ప్లస్ కానుంది. ఫ్యాన్స్ ఇప్పటికే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయాలని బలంగా కోరుకుంటున్నారు. తొలి భాగం మాదిరిగానే, 'అఖండ 2' కూడా వసూళ్ల సునామీ సృష్టించి, బాలయ్య కెరీర్‌లోనే మరో మైలురాయిగా నిలవాలని అభిమానులు ఆశిస్తున్నారు. అఖండ2 సినిమా రికార్డులు క్రియేట్ చేయాలనీ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి