యాంకర్ మంచు ఫ్యామిలీలో గొడవల పై ప్రశ్నించగా?.. మంచు లక్ష్మి మాట్లాడుతూ.. ఈ గొడవల వల్ల తాను ఎంత ఇబ్బంది పడ్డానో తెలియజేసింది. తనకు ఆ దేవుడు వచ్చి ఒక వరం కోరుకోమంటే ఖచ్చితంగా నా కుటుంబం అంతా మళ్ళి కలిసిపోవాలని కోరుకుంటానని. ప్రతి కుటుంబంలో కూడా గొడవలు సహజమే, ఎన్ని గొడవలు జరిగిన చివరి వరకు అందరూ కలవాల్సిందే.. కానీ కొంతమంది గొడవలు అయితే ఇక జీవితాంతం కలవకూడదనుకుంటుంటారు. మనకు ఎన్ని ఉన్నప్పటికీ చివరికి మిగిలేది రక్తసంబంధీకులు మాత్రమే, కుటుంబంతో ఆనందంగా ఉండడానికి ఎన్ని పోరాటాలైన చేయాలి..
ప్రస్తుతం తాను ముంబైలో ఉంటున్నానని ఇక్కడ తన కుటుంబంలో గొడవలు జరిగినప్పుడు తాను బాధపడడం లేదని ఎంతోమంది ఆర్టికల్స్ రాశారు. వాటన్నిటిని చదివి తాను ఎంతగా కుమిలి పోయేదాన్నో నాకు మాత్రమే తెలుసు.. కానీ ఆ వార్తలన్నిటికీ స్పందించాలనుకోలేదు. నా కుటుంబంలో ఇలా జరుగుతుందని తాను కలలో కూడా ఊహించలేదు. తన కుటుంబంలో జరిగిన సంఘటన వల్ల చాలా బాధపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. నా కుటుంబం అంతా కలిసి పోవాలని నాకున్న ఏకైక కోరిక అంటూ తెలియజేసింది మంచు లక్ష్మి. అయితే ఇది మా వ్యక్తిగత కుటుంబ విషయం కాబట్టి ఈ విషయాలపైన తాను స్పందించాలనుకోలేదంటూ తెలియజేసింది మంచు లక్ష్మి. ప్రస్తుతం మంచు లక్ష్మి చేసిన ఈ ఎమోషనల్ కామెంట్స్ కి పలువురు నేటిజన్స్ కూడా మంచు లక్ష్మి కి సపోర్టివ్ చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి