రామ్ పోతినేని నటించిన తాజా చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ థియేటర్లలో విడుదలైన కొద్ది సేపటికే సూపర్ హిట్ టాక్‌ను అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు ఉండగా, ఫస్ట్ షో మొదలైన వెంటనే ప్రేక్షకులు సోషల్ మీడియాలో వరుసగా పాజిటివ్ రివ్యూలతో ముంచెత్తేశారు. సోషల్ మీడియా అందుబాటు పెరగడంతో ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను నిర్భయంగా, ఎలాంటి సంకోచం లేకుండా చెప్పేస్తున్నారు. ఈ సినిమా విషయానికొస్తే, ఆ అభిప్రాయాలన్నీ రామ్ కెరీర్‌కు మరోసారి అదిరిపోయే బూస్ట్‌గా మారాయి. ఎందుకంటే, చాలా రోజుల తర్వాత రామ్ పోతినేని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఆల్ రౌండ్ హిట్ ఈ సినిమా రూపంలో వచ్చిందని అందరూ చెబుతున్నారు.


ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించి ఆకట్టుకుంది. అలాగే కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో మెరిసి, తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో సినిమాకి ఒక రేంజ్ హైప్ తీసుకువచ్చాడు. యాక్షన్, ఎమోషన్, రొమాన్స్, స్టోరీ ప్రెజెంటేషన్– అన్నీ కలిసి ఈ సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా నిలబెట్టాయి. విడుదలైన ప్రతి సెంటర్‌లోనూ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ హౌస్‌ఫుల్ షోలను నమోదు చేస్తూ బాక్సాఫీస్ వద్ద శుభారంభం చేసింది. ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికి వస్తే, ఇది రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ రికార్డ్ క్రియేట్ చేస్తుందన్న అంచనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.



ఇంతలో సోషల్ మీడియాలో అభిమానులు ఒక డైలాగ్‌ను ప్రత్యేకంగా హైలైట్ చేస్తున్నారు. మహేష్ బాబు–పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమా "పోకిరి" లో ఉన్న “ఎప్పుడొచ్చామా అన్నది కాదు… బుల్లెట్ దిగిందా లేదా!” అనే డైలాగ్‌ను రిఫరెన్స్‌గా తీసుకుని, ఈ సినిమాకు అన్వయిస్తూ ఇలా చెబుతున్నారు “ఎప్పుడు వచ్చామన్నది కాదు… హిట్ కొట్టామా లేదా అదే ఆంధ్రా కింగ్ పవర్!” ఈ మీమ్స్, పోస్టులన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ హాట్ టాపిక్‌గా మారాయి. మొత్తం మీద, గత కొంతకాలంగా పెద్ద హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్ పోతినేని ఫ్యాన్స్‌కు ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ పూర్తి స్థాయి సంతృప్తిని ఇచ్చిందని చెప్పాలి. ఈ సినిమా రామ్ కెరీర్‌ను మరోసారి బలంగా ట్రాక్‌పైకి తీసుకొచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: