నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, సంయుక్త మీనన్ హీరోయిన్‌గా, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అత్యంత ఆవైటెడ్ సీక్వెల్ చిత్రం “అఖండ 2 తాండవం”. ఇప్పటికే భారీ హైప్‌ని సొంతం చేసుకుంది ఈ చిత్రం. బాలయ్య కెరీర్‌లోనే అత్యంత భారీ రేంజ్‌లో విడుదల కానున్న మూవీ ఇదేనని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మొదటి భాగం సెన్సేషన్‌ను దృష్టిలో పెట్టుకుని, ఈ సారి బోయపాటి–బాలయ్య కాంబినేషన్ ఏ స్థాయి దాకా వెళుతుందోనని అభిమానుల్లో ఆతృత మరింతగా పెరుగుతుంది.


అఖండ 1 రిలీజ్ అయ్యినప్పుడు థియేటర్స్‌లో ప్రేక్షకులు పొందిన మ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఆ హై కు ముఖ్యమైన కారణాల్లో సంగీత దర్శకుడు థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టాప్‌లో ఉంటుంది. పూనకాలు తెప్పించే విధంగా ఉంటుంది ధమన్ మ్యూజిక్. ముఖ్యంగా అఖండ ఫస్ట్ పార్ట్ ఇంటర్వెల్ బ్లాక్… ఒక్కసారిగా థియేటర్‌నంతా షేక్ చేసిన బీజిఎం… ప్రేక్షకులు సీట్లు వదిలి లేచేలా చేసిన రేంజ్… ఇవన్నీ ఇప్పటికీ ఫ్యాన్స్ మెదళ్లలో మార్మోగుతూనే ఉన్నాయి.



ఇప్పుడు అదే మ్యాజిక్‌ను, మరింత రెట్టింపు ఎనర్జీతో అఖండ 2 కోసం థమన్ మళ్లీ సెట్ చేస్తున్నాడు. రీసెంట్ గా ఆయన చేసిన ఒక స్పెషల్ పోస్ట్ సోషల్ మీడియాలో అంతటా వైరల్ అవుతోంది. “అఖండ 2 ఇంటర్వెల్… ఏం హై రా బాబు!” అంటూ చేసిన  పోస్ట్ ఫ్యాన్స్‌లో అసలైన కిక్‌ని ఇచ్చేసింది. ఈ ఒక్క లైన్‌తోనే అఖండ 2 ఇంటర్వెల్ బ్లాక్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకే స్థాయికి చేరిపోయాయి.



ఇండస్ట్రీలో ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి –“బాలయ్య ఇంటెన్సిటీ ఏ రేంజ్‌లో ఉంటుంది?”..“బోయపాటి వైలెన్స్.. ఈసారి ఎంత ఎత్తుకి తీసుకెళ్తుంది?”..“థమన్ మ్యూజిక్‌తో ఇంటర్వెల్ బ్లాస్ట్ ఎలా గర్జిస్తుంది?”అని..అయితే ఈసారి బోయపాటి, బాలయ్య, థమన్ త్రయం కలిసి ప్రేక్షకులకు ఎలాంటి గొప్ప విస్ఫోటనం అందించబోతుందో తెలుసుకోవాలంటే… మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.ఈ డిసెంబరు 4న అర్ధరాత్రి నుండి “అఖండ 2 తాండవం” నిజమైన శక్తి, శౌర్యం, రౌద్రం, ఆధ్యాత్మిక మాస్ ఎమోషన్ కలిసిన ఆ అనుభూతిని థియేటర్స్‌లో ఎలా రెట్టింపు చేస్తుందో… అప్పుడే స్పష్టమవుతుంది. ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికే కౌంట్‌డౌన్ స్టార్ట్ చేశారు.“బాలయ్య అరిస్తే… బాక్సాఫీస్ కంపిస్తుంది” అని నమ్మకం పూర్తి స్థాయిలో కనిపిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: