ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నిహారిక దీని పై స్పందించింది. “ఆ విషయం గురించి నాకు పెద్దగా అవగాహన లేదు. కానీ మా కుటుంబంలో సినిమా అంటే ఒక జీవనాధారం. చిన్నప్పటి నుంచీ సినిమా పట్ల నిజాయితీని నేర్చుకున్నాం. నా జీవితంలో ఒక్కసారైనా నేను పైరసీ సినిమా చూడలేదు. ఇంగ్లీష్ సినిమాలు కూడా పైరసీలో చూడాలనే ఆలోచనే రాలేదు. ఎవరైనా నా ముందు ‘పైరసీ సినిమా చూద్దాం’ అనినా, నేను ఎప్పుడూ ఎంకరేజ్ చేయలేదు. మనమొక సినిమా తీస్తే, అది అందరికీ సమానంగా అందాలి. చూడాలనుకున్నవారు అందరూ ఫ్రీగా చూడాలి లేదా అందరూ టికెట్ కట్టి చూడాలి — మధ్యలో అసమానత ఉండకూడదు. దాని మీద ప్రతి ఒక్కరి అభిప్రాయాలు వేరే ఉండొచ్చు. కానీ ఇంకెవరికి చెందిన వస్తువును దొంగిలించి ‘నేను సమాజానికి న్యాయం చేస్తున్నా’ అని చెప్పడం అసలు సరైంది కాదు.
సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ ఆప్షన్ మాత్రమే. నాలుగు రోజులు ఆహారం లేకుంటే బతకలేం, నీళ్లు లేకుంటే బతకలేం — కానీ సినిమా లేకుంటే ఎవరూ చచ్చిపోరు. క్రికెట్ ఆడకపోయినా ఎవరికి ఎలాంటి ప్రమాదం ఉండదు. అలాగే సినిమా చూడలేదని కూడా ఎలాంటి నష్టం లేదు. మీ ఎకనామికల్ స్టేటస్ చూసుకొని నిర్ణయం తీసుకోవాలి. నిజంగా మీకు టికెట్ రేట్లు ఎక్కువగా అనిపిస్తే — థియేటర్‌కి వెళ్లకండి. ఇంట్లోనే మరో వినోదం చూసుకోండి. కొన్నిసార్లు నాకు కూడా టికెట్ ధరలు ఎక్కువగా అనిపిస్తాయి. ₹500, ₹1000, ఇంకా ₹2000 టికెట్ ధరలు పెట్టలేనని అనిపించినప్పుడు, నేను కూడా ఆ సినిమా చూడకుండా వదిలేస్తాను. నష్టం అనిపించినా పర్లేదు — అది నా నిర్ణయం.
కానీ ఇంకెవరైనా వచ్చి, ‘నేను మీకోసం ఫ్రీగా సినిమా చూపిస్తా… ఇది మీకోసం చేస్తున్న న్యాయం’ అంటే — మీరు ఎవరు బాబూ? నువ్వు లా అండ్ ఆర్డర్ చూడాల్సిన పోలీసు కాదు. అలాంటప్పుడు ఏ రాబిన్ హుడ్ పాత్ర పోషించడానికి ప్రయత్నిస్తున్నావు?”అని నిహారిక గట్టిగా ప్రశ్నించింది.నీహారిక మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయ్. దీని పై చాలా మంది పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఏ రా సినిమా లేకపోతే చచ్చిపోతావ ఏంటి..? అంటూ ఆమె మాటలను బాగా వైరల్ చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి