ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర మరోసారి హాట్ టాపిక్ గా నిలిచిన బాలీవుడ్ సినిమా “ ధురంధర్ ”. బాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ సినిమా తొలి షో నుంచే సాలిడ్ టాక్ తెచ్చుకొని అదరగొట్టింది. అయితే ఈ సినిమా నిజ జీవిత సంఘటనలు ఆధారంగా తెరకెక్కించగా ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చుతోంది. ఈ క్రమంలో నే ఈ సినిమా లో ఎమోషన్ కి భారత దేశపు ఆడియెన్స్ కనెక్ట్ అవుతున్నారు. అయితే ఈ సినిమాపై సీనియర్ నటి రేణు దేశాయ్ కూడా స్పందించడం జరిగింది. రేణు దేశాయ్ ఈ సినిమా పై ఇచ్చిన రివ్యూ ఇప్పుడు నేషనల్ మీడియాలో నూ ట్రెండ్ అవుతోంది. ధురంధర్ సినిమా ఖచ్చితంగా ప్రతీ ఒక్క భారతీయుడు చూడాల్సిన సినిమా అని దర్శకుడు ఆదిత్య ధర్ బ్రిలియంట్ వర్క్ అందించారని రేణు దేశాయ్ కొనియాడారు.
ఇక మనలను క్షేమంగా ఉంచేందుకు ఇండియన్ ఆర్మీ , భారతీయ రక్షణా దళం 24 గంటలూ శ్రమిస్తున్నార అన్నారు. వారి వల్లే మీరు రక్షణ, స్వేచ్ఛని ఎంజాయ్ చేస్తున్నారు అంటేధురంధర్ సినిమా చూస్తే మీకు అర్ధం అవుతుంది అని రేణు దేశాయ్ తన అభిప్రాయం తెలిపారు. ఇక ఇకనైనా సూడో సెక్యులర్స్ గా ఉండడం మానుకొని మన దేశం వైపు ప్రతీ ఒక్కరూ నిలబడాలి అని కొందరు ఫేక్ సెక్యులర్స్ కి కూడా కొంచెం ఘాటు గానే తన స్పందన వ్యక్తం చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి