తొలి రోజు ఇండియాలో సుమారుగా రూ.45 కోట్ల రూపాయలు నెట్ వసూల్ రాబట్టినట్టు తెలుస్తోంది. అలాగే ప్రీమియర్ షోలతో కలిపి రూ. 54 కోట్ల రూపాయల వరకు వచ్చాయని, ప్రపంచవ్యాప్తంగా సుమారుగా రూ .90 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ రాబడినట్లు ప్రముఖ ఆంగ్ల మ్యాగజైన్లో ప్రచురించబడింది. ఇప్పటికే ఏపీలో టికెట్ల ధరలు పెంపు కొనసాగుతూ ఉండగా తెలంగాణలో మాత్రం టికెట్ల రేటు పెంపును హైకోర్టు సస్పెండ్ చేసింది దీని ప్రభావం వల్ల తెలంగాణలో కలెక్షన్స్ పైన ప్రభావం పడిందనే విధంగా వినిపిస్తున్నాయి. మొదటి రోజు కనీసం రూ .100 కోట్లయినా కలెక్షన్స్ రాబడుతుందని భావించినప్పటికీ నిరాశనే మిగిల్చింది.
మొదటిసారి ఇలాంటి హర్రర్ కామెడీ జోనర్ ను ట్రై చేసిన ప్రభాస్ సక్సెస్ అయిన డైరెక్టర్ ఫెయిల్యూర్ అయ్యారని టాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో కొంతమంది అభిమానులు డైరెక్టర్ ఇంటికి వెళ్లి మరి అక్కడ గొడవకు దిగినట్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి ప్రభాస్ కెరియర్ లోనే పాన్ ఇండియా లేవల్లో విడుదలై అతి తక్కువ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలుస్తోంది. సినిమా చివరిలో జోకర్ పాత్రను చూపించి రాజా సాబ్ 2 కి (రాజాసాబ్ సర్కస్ 1935) ఉంటుందని ప్రకటించారు. మరి రాజా సాబ్ 2 సినిమా ఉంటుందా? లేదా అనే విషయంపై చిత్ర బృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి