దీనితో మల్టీప్లెక్స్‌లలో గరిష్ట టికెట్ ధర రూ. 395 వరకు ఉండగా, సింగిల్ స్క్రీన్లలో రూ. 227గా ఉండనుంది. ఈ పెంపుదల కేవలం మొదటి ఏడు రోజుల పాటు మాత్రమే అమల్లో ఉంటుంది. అలాగే రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకోవచ్చని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మెగా మూవీకి బూస్ట్ ఇచ్చేలా టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. ఏపీలో జనవరి 11న రాత్రి 8 గంటల నుండి 10 గంటల మధ్య ప్రదర్శించే పెయిడ్ ప్రీమియర్స్ ధరను రూ. 500 (జీఎస్టీతో కలిపి)గా ఖరారు చేశారు. ఇక జనవరి 12 నుండి పది రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో రూ. 100, మల్టీప్లెక్స్‌లలో రూ. 125 చొప్పున అదనంగా వసూలు చేసుకోవచ్చు. దీనివల్ల ఏపీలోని సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధర రూ. 247, మల్టీప్లెక్స్‌లలో రూ. 302 వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ ఉత్తర్వులతో అడ్వాన్స్ బుకింగ్స్ జోరందుకున్నాయి.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నయనతార కథానాయికగా నటించింది. విక్టరీ వెంకటేష్ సుమారు 25 నిమిషాల నిడివి గల కీలక పాత్రలో మెరవనుండటం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సాహు గారపాటి మరియు సుష్మిత కొణిదెల నిర్మించారు. మెగాస్టార్ తన 71 ఏళ్ల వయసులో కూడా ఎనర్జిటిక్ డాన్స్ స్టెప్పులతో సోషల్ మీడియాను ఊపేస్తున్నారు. భారీ టికెట్ ధరలు ఉన్నప్పటికీ, మెగా క్రేజ్ ముందు అవేమీ అడ్డంకి కావని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సంక్రాంతి రేసులో మెగాస్టార్ మరోసారి బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఈ సినిమా సాధించే వసూళ్లు ఏ స్థాయిలో ఉంటాయో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి