పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్.. ఈ కాంబినేషన్ అంటేనే ఒక లెక్క. గతంలో వీరు కలిసి చేసిన 'గబ్బర్ సింగ్' టాలీవుడ్ రికార్డులను ఎలా తిరగరాసిందో మనందరికీ తెలిసిందే. మళ్ళీ ఇన్నాళ్లకు వీరిద్దరూ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోయడానికి సిద్ధమవుతున్నారు. సినిమా ఇంకా షూటింగ్ స్టేజ్‌లోనే ఉన్నా, ఈ మూవీ బిజినెస్ రేంజ్ చూస్తుంటే ట్రేడ్ వర్గాలకు మైండ్ బ్లాక్ అవుతోంది. తాజాగా ఈ సినిమా OTT పార్ట్నర్ ఖరారైనట్లు అధికారిక సమాచారం వెలువడింది.ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా డిజిటల్ హక్కులను ఫాన్సీ ధర చెల్లించి దక్కించుకుంది. పవన్ కళ్యాణ్ క్రేజ్ మరియు హరీష్ శంకర్ మేకింగ్‌పై నమ్మకంతో నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తాన్ని వెచ్చించినట్లు తెలుస్తోంది. సినిమా థియేటర్లలో విడుదలైన కొన్ని వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమ్ కానున్నప్పటికీ, ఇప్పుడే డీల్ క్లోజ్ అవ్వడం పవన్ కళ్యాణ్ స్టామినాకు నిదర్శనం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుండటంతో ప్రొడక్షన్ వాల్యూస్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను రెడీ చేస్తున్నారు.


"ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది" అని టీజర్‌లో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ అప్పట్లోనే సెన్సేషన్ అయ్యింది. హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్‌లోని మాస్ యాంగిల్‌ను ఏ రేంజ్ లో చూపిస్తారో మనందరికీ తెలుసు. కేవలం రిమేక్ మాత్రమే కాకుండా, తెలుగు ఆడియన్స్ పల్స్‌కు తగ్గట్టుగా కథలో భారీ మార్పులు చేసి, పవన్ పొలిటికల్ ఇమేజ్‌ను కూడా దృష్టిలో ఉంచుకుని పవర్ ఫుల్ డైలాగ్స్ రాసినట్లు టాక్. గ్లామర్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది.ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నందున, షూటింగ్‌కు చిన్న చిన్న గ్యాప్స్ వస్తున్నాయి. అయినప్పటికీ, హరీష్ శంకర్ తన టీమ్‌తో కలిసి వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ లో పవన్ కళ్యాణ్ పోలీస్ లుక్, ఆ మాస్ మేనరిజం చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇప్పుడు ఓటీటీ పార్ట్నర్ కూడా ఫిక్స్ అవ్వడంతో, ఇక నెక్స్ట్ అప్‌డేట్ నేరుగా థియేటర్లలో బాంబు పేలడమే అని ఫ్యాన్స్ ఆశగా ఉన్నారు.



పవన్ కళ్యాణ్ సినిమాలకు ఉండే డిమాండ్ దృష్ట్యా, ఓటీటీ హక్కుల ద్వారానే సగం బడ్జెట్ వెనక్కి వచ్చేసినట్లు సినీ వర్గాల భోగట్టా. శాటిలైట్ రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా భారీగా అమ్ముడయ్యే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే 'ఉస్తాద్ భగత్ సింగ్' కేవలం సినిమా మాత్రమే కాదు, బాక్సాఫీస్ వద్ద ఒక భారీ కమర్షియల్ బ్రాండ్ అని అర్థమవుతోంది.మొత్తానికి 'ఉస్తాద్ భగత్ సింగ్' నెట్‌ఫ్లిక్స్‌లో రాబోతోందన్న వార్త పవర్ స్టార్ ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. థియేటర్లలో రచ్చ చేసిన తర్వాత, ఓటీటీలో కూడా 'భగత్ సింగ్' ఏ రేంజ్ వ్యూయర్ షిప్ దక్కించుకుంటాడో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: