ఏదైనా సినిమాను ఎంత గొప్పగా రూపొందించాము అనే దాని కంటే కూడా ఆ సినిమా విడుదల విషయంలో ఎంత గొప్పగా నిర్ణయం తీసుకున్నాము అనేదే చాలా ముఖ్యమని ఎంతో మంది అభిప్రాయ పడుతూ ఉంటారు. అందుకు ప్రధాన కారణం సినిమాను ఎంత గొప్పగా రూపొందించిన ఆ సినిమా విడుదలకు విషయంలో మంచి ప్రాణాలిక లేకపోయినట్లయితే సినిమా పెద్ద స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వెళ్లదు అని కొంత మంది అభిప్రాయం. ఇకపోతే తాజాగా శర్వానంద్ "నారీ నారీ నడుమ మురారి" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ విడుదల తేదీని సంక్రాంతి పండుగ దగ్గరికి వచ్చిన సమయం లో ప్రకటించారు. అప్పటికే సంక్రాంతి పండక్కు చాలా సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి.

అలాగే ఆల్మోస్ట్ అందరూ థియేటర్లను కూడా బుక్ చేసుకున్నారు. అలాంటి సమయంలో ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండక్కు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆ తర్వాత ఈ మూవీ ని జనవరి 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక ఈ మూవీ లేటుగా రావడంతో కాస్త తక్కువ థియేటర్లు దొరికాయి. కానీ ఈ మూవీ కి అద్భుతమైన బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది.

దానితో ఈ సినిమా తక్కువ థియేటర్లతోనే మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5.13 కోట్ల షేర్ ... 8.90 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టగా , ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లో 7.23 కోట్ల షేర్ ... 13.10 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఈ మూవీ 10.25 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరి లోకి దిగగా ... మరో 3.02 కోట్ల కలెక్షన్లను రాబడితే ఈ మూవీ క్లీన్ హేట్ గా నిలుస్తుంది. ఇలా తక్కువ థియేటర్లలో విడుదల అయ్యి కూడా ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను రాబడుతూ ఉండడంతో ఈ మూవీ బృందం వారు ముందుగా పక్కాగా ప్లాన్ చేసి సంక్రాంతికి కాస్త ఎక్కువ థియేటర్లను బుక్ చేసి ఉండి ఉంటే ఈ మూవీ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కూడా కంప్లీట్ చేసుకుని భారీ లాభాలను అందుకునేది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: