టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా ది రాజా సాబ్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. నిధి అగర్వాల్ , మాలవిక మోహన్ , రీద్ది కుమార్ లు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించగా ... మారుతి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను జనవరి 9 వ తేదీన విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 101.80 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి.
మెగాస్టార్ చిరంజీవి తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన మన శంకర వర ప్రసాద్ గారు అనే సినిమాలో హీరో గా నటించాడు. నయన తార ఈ మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల చేశారు. ఈ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 74.25 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి.
తమిళ నటుడు శివ కార్తికేయన్ ఈ సంవత్సరం పరాశక్తి అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్గా నటించింది. ఈ మూవీ కి విడుదల ఆయన మొదటి రోజు 27 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి.
టాలీవుడ్ యువ నటుడు నవీన్ పోలిశెట్టి తాజాగా అనగనగా ఒక రాజు అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ని ఈ సంవత్సరం జనవరి 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 14.80 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి.
ఇలా ఇప్పటి వరకు ఈ సంవత్సరం విడుదల అయిన సినిమాలలో మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 4 మూవీల లిస్టులో ఈ 4 సినిమాలు నిలిచాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి