టాలీవుడ్, కోలీవుడ్లో హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించిన ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 30కి పైగా చిత్రాలలో నటించింది. కౌసల్య కృష్ణమూర్తి అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించింది. గత ఏడాది అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ, మరో హీరోయిన్ మీనాక్షి చౌదరి నీ కూడా డామినేట్ చేసేలా నటించింది. దీంతో ఐశ్వర్య కెరియర్ కు ఇక డోకా లేదని వరుస అవకాశాలు తలుపు తడతాయని అభిమానులు భావించారు.



ప్రస్తుతం పలు చిత్రాలలో నటిస్తున్నప్పటికీ తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య రాజేష్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత తనకి మంచి అవకాశాలు వస్తాయనుకున్న. ముఖ్యంగా స్టార్ హీరోలతో నటించే అవకాశాలు వస్తాయని ఆశించాను, కానీ అలా జరగలేదు.. టాలీవుడ్ లో ఇప్పుడొస్తున్న హీరోయిన్ పాత్రలు తాను చేయగలరా? అనే డౌటు అటు డైరెక్టర్లలో హీరోలలో ఉందేమో అందుకే తనకి అవకాశాలు తగ్గిపోయాయని తెలియజేసింది.


ప్రస్తుతం తనకు వస్తున్న అవకాశాలతో తాను సంతోషంగానే పాత్రలలో నటిస్తున్నానని వెల్లడించింది. అలాగే తాను నటించిన కాకా ముట్టై చిత్రంలో తాను ఇతర పిల్లల తల్లిగా కూడా నటించాను ఆ సమయంలో తన వయసు కేవలం 20 ఏళ్ల అని ఇప్పటివరకు నటిగా తను చేసిన పాత్రలన్నీ కూడా తనకి గౌరవాన్ని పెంచేలా చేశాయి అంటూ తెలియజేసింది. ఐశ్వర్య రాజేష్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి..నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే పలు రకాల ఫోటోలతో ఫాలోవర్స్ ని పెంచుకునే పనిలో పడింది ఐశ్వర్య రాజేష్. మరి రాబోయే రోజుల్లోనైనా స్టార్ హీరోలతో నటించే అవకాశాలను అందుకుంటుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: