2011లో అల్లు అర్జున్, స్నేహ రెడ్డి వివాహం చేసుకున్నారు. దీంతో మార్చి 6తో 15వ వివాహ వార్షికోత్సవాన్ని చాలా గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేసుకున్నారు ఈ జంట. దీంతో అల్లు అర్జున్ తన భార్య స్నేహ రెడ్డికి ఒక మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పెళ్లిరోజుని పురస్కరించుకుని తన భార్యకు విషెస్ తెలియజేస్తూ.. బెంజ్ ఎమోజి మోడల్ కారును గిఫ్టుగా ఇచ్చారు అల్లు అర్జున్. అందుకు సంబంధించిన ఒక వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ కారు ధర సుమారుగా రూ .4 నుంచి రూ .5 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.
అల్లు అర్జున్, స్నేహ రెడ్డిది ప్రేమ వివాహం. వీరికి అయాన్, అర్హ అనే పిల్లలు కూడా ఉన్నారు. అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా దీపికా పదుకొనే నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ లోకేష్ కనకరాజు తో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు అయితే జరుగుతున్నాయి. ఆ తర్వాత డైరెక్టర్ సుకుమార్ తో పుష్ప 3 సినిమా తీశా అవకాశం ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి