ఇక ఈ సినిమాను ప్రపంచానికి పరిచయం చేసే విషయంలో రాజమౌళి అనుసరిస్తున్న వ్యూహాలు కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సాధారణ ప్రమోషన్‌లకు భిన్నంగా, ఆయన చాలా ప్లాన్డ్‌గా, స్టెప్ బై స్టెప్‌గా ఆసక్తిని పెంచే విధంగా ముందుకు వెళ్తున్నారు. గత ఏడాది ఈ సినిమా సెట్స్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు, ఫోటోలు అంతర్జాతీయ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా బయటకు రావడం గమనార్హం. అవి అధికారికంగా విడుదల చేయకపోయినా, ఆ లీక్‌లే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచాయి.ఈ విధానం చూస్తుంటే, సినిమా రిలీజ్ అయ్యే వరకు ప్రేక్షకుల మధ్య చర్చలు కొనసాగించేలా రాజమౌళి ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్టు అనిపిస్తోంది. ప్రతి చిన్న అంశాన్ని కూడా హైలైట్ అయ్యేలా చేయడం, ఎలాంటి సమాచారం బయటకు రావాలో, ఎప్పుడు రావాలో ముందుగానే ప్లాన్ చేయడం ఇవి అన్నీ ఆయన పని తీరు ఎంత ప్రత్యేకమో చూపిస్తున్నాయి.
దీనివల్లే ఇప్పుడు “వారణాసి” సినిమా గురించి దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అభిమానులు కూడా రాజమౌళి పని తీరు మీద ప్రశంసలు కురిపిస్తూ, ఈ సినిమాకి భారీగా ప్రమోషన్స్ చేస్తున్నారు. “జక్కన్న”కి ప్రత్యేకమైన స్టైల్ ఉందని, ఆయన పని చేసే విధానం ఇతర దర్శకులకు ఒక మోడల్‌లా మారిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.మొత్తానికి, “వారణాసి” సినిమా విడుదలకు ముందే ఒక భారీ సంచలనంగా మారింది. ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న అంచనాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. సినిమా విడుదలైన తర్వాత అది భారతీయ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుందా లేదా అన్నది చూడాలి, కానీ ఇప్పటి వరకు మాత్రం రాజమౌళి తన ప్రణాళికతో ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు అనే విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి