ఇప్పటికే విడుదలైన ట్రైలర్ పై సినిమా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ ట్రైలర్ చూసిన సీనియర్ హీరోలు కూడా అడవి శేష్ నటను ప్రశంసించారు. గతంలో గూఢచారి, మేజర్, హిట్ 2 వంటి చిత్రాలతో మంచి విజయాలను అందుకున్న అడవి శేష్ ఇప్పుడు మరొకసారి డెకాయిట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఈ సినిమా కూడా హిట్ కొట్టారని తెలిసి అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇటీవలే సెన్సార్ బోర్డ్ యూఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ వస్తుందని అంతా అనుకున్నప్పటికీ కానీ యూఏ సర్టిఫికెట్ రావడంతో చిత్ర బృందం కాస్త ఊపిరి పీల్చుకుంది.
ఈ సినిమా 16 ఏళ్లు దాటిన వారు ఎలాంటి అభ్యంతరం లేకుండా చూడవచ్చు. ఈ సినిమా రన్ టైం కూడా 2 గంటల 40 నిమిషాలు ఉంటుందని సమాచారం. ఈ చిత్రంలో గత చిత్రాలకు భిన్నంగా అడవి శేష్ చాలా మాస్ పాత్రతో ఆకట్టుకుంటారని, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పాత్ర కూడా ఈ సినిమాలో అద్భుతంగా నటించింది. డెకాయిట్ చిత్రంలో హరి (అడవి శేష్), జూలియట్ గా (మృణాల్) లవ్ స్టోరీ కూడా సూపర్ గా ఉంటుందని అయితే వాళ్ళు ఎందుకు విడిపోయారు అనేది సినిమా ఆసక్తికరంగా ఉంటుందని, సినిమా ఫస్ట్ అఫ్ అంతా కూడా ఆసక్తికరంగా ఉంటుంది సెకండ్ హాఫ్ లో అదిరిపోయే ట్విస్టులతో పాటు, థ్రిల్లింగ్ సీన్స్, క్లైమాక్స్ లో అద్భుతంగా ముగుస్తుందని. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఈ మధ్యకాలంలో వచ్చిన ఏ చిత్రంలో కూడా చూడలేదని టాక్ వినిపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి