వాస్తవానికి మన శరీరం కూడా ఒక యంత్రంలాంటిది. లోపల ఎలాంటి చిన్న సమస్య ఉన్న అది పలు రకరకాల సంకేతాల ద్వారా మనల్ని హెచ్చరిస్తుంది. అలా మనం పోసే మూత్రం రంగు ద్వారా కూడా మనకి ఒక సంకేతం అందిస్తుందని వైద్యులు సైతం చెబుతున్నారు. ముఖ్యంగా మూత్రం పసుపు రంగులో వస్తే మధుమేహానికి ఉన్న అసలు సంబంధం ఏంటో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.

వైద్యులు తెలుపుతున్న ప్రకారం.. మూత్రం పసుపు రంగులోకి మారిందంటే అది కేవలం మధుమేహం వల్లే కాదని దీనికి కొన్ని కారణాలు కూడా ఉండవచ్చు అంటూ చెబుతున్నారు.

సాధారణంగా పగటిపూట ఎండలో ఎక్కువగా తిరిగినప్పుడు కూడా ఇలాగే జరుగుతుందని, మనం పగటిపూట తగిన నీరు తాగకపోతే మూత్రం ముదురు పసుపు రంగులోకి మారుతుందని చెబుతున్నారు.

ఆగి కొన్ని సందర్భాలలో మనం ఏదైనా విటమిన్ సప్లిమెంట్లు లేదా ఇతర మందులు వాడినప్పుడు కూడా ఇలా పసుపు రంగులోకి మారే అవకాశం ఉందని చెబుతున్నారు.


మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ లేదా శరీరంలో బ్యాక్టీరియా వైరస్ వంటివి పోరాడుతున్నప్పుడు కూడా మూత్రం పసుపు రంగులోకి మారుతుందని చెబుతున్నారు.


రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు శరీరం అదనపు చెక్కెరను మూత్రం ద్వారా బయటికి పంపించేలా చేస్తుంది. ఈ క్రమంలోనే శరీరం నుంచి ఎక్కువ నీరు బయటికి పోయి నిర్జలీకరణంగా ఏర్పడుతుందట. దీనివల్ల డిహైడ్రేషన్ ఏర్పడి  మూత్రం ముదురు పసుపు రంగులోకి మారుతుంది.


రాత్రి సమయాలలో ఎక్కువసార్లు మూత్రవిసర్జన తరుచు వెళ్లడం, ఎన్నిసార్లు నీళ్లు తాగిన నోరు ఎండిపోయినట్టుగా అనిపించడం, చూపు మసకబారడం లేదా కంటే కింద నల్లటి మచ్చలు రావడం, తగినంత విశ్రాంతి తీసుకున్నప్పటికీ నీరసంగా కనిపించడం, చిన్న దెబ్బలు తగిలిన అవి మానడానికి ఎక్కువ సమయం పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తే మధుమేహం సంకేతాలు. దీంతో వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: