టాలీవుడ్ హీరోయిన్ తమన్నా కు హైకోర్టులో భారీ షాక్ తగిలింది.ఒక ప్రైవేట్ సోప్ కంపెనీ పైన ఆమె దాఖలు చేసినటువంటి కోటి రూపాయల ఫిటీషన్ ను సైతం న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసు సుమారుగా 16 సంవత్సరాల క్రితం నాటిది. 2008 అక్టోబర్లో తమన్నా ఒక సోప్ కంపెనీ తో ఒప్పందం చేసుకున్నది. అయితే ఆ ఒప్పందం ప్రకారం ఒక ఏడాది పాటు (2009 వరకు) ఆ సంస్థ ఉత్పత్తులకు ఈమె బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాల్సి ఉంటుంది.


కానీ ఆ ఒప్పందం ముగిసిన తర్వాత కూడా సదురు కంపెనీ తన ఫోటోలను ప్రకటనలో సోప్ ప్యాకింగ్ ల పైన ఉపయోగించిందని తమన్నా ఆరోపణలు చేసింది. 2010, 2011 కాలంలో తన అనుమతి లేకుండా తన ఫోటోలను ఉపయోగించడం వల్ల వృత్తిపరమైన అవకాశాలు దెబ్బతిన్నాయని, మార్కెట్ విలువ కూడా తగ్గింది అంటూ తమన్నా వాదించింది. దీంతో ఆమెకు కోటి రూపాయల వరకు నష్టపరిహారం చెల్లించాలని కోర్టుని ఆశ్రయించారు. అయితే ఈ కేసును విచారించిన సింగిల్ జడ్జి బెంచ్ తమన్నా సమర్పించిన సాక్షాదారాలు సరిగ్గా లేవంటూ పిటిషన్ కొట్టేసింది.


ఈ విషయం పైన తమన్నా మద్రాస్ హైకోర్టులోని డివిజన్ బెంచ్ కు అప్లై చేశారు. 2026 ఏప్రిల్ 16న ఈ ఆపిల్ పైన విచారణ చేపట్టగా.. తమన్నా సమర్పించిన సోప్ రాపర్లు కొనుగోలు రసీదులు ఆ కంపెనీకి చెందినవే అని నిరూపించుకోవడానికి బలమైన ఆధారాలు లేవంటూ కోర్టు తెలియజేసింది. ఆ ప్రకటనలు ఒప్పందం కాలం తర్వాతే వచ్చాయని చెప్పడానికి సాంకేతికపరమైన లేదా నిర్దిష్టమైన ఆధారాలు లేవంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ గతంలో సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి కూడా ఎటువంటి కారణాలు లేవంటూ స్పష్టం చేసింది. ఈ తీర్పుతో గత కొన్నేళ్లుగా  న్యాయపోరాటం కోసం పోరాడుతున్న తమన్నా కేసు ముగింపుకు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: